Kargil Vijay Diwas: ‘కార్గిల్ దివస్’ వేడుకలు ఎందుకు జరుపుకుంటారు? ఆరోజున ఏం జరిగింది?

భారత్, పాకిస్తాన్ మధ్య 1999లో ఉగ్రవాదుల విషయంలో ఒప్పందం జరిగింది. కానీ పాకిస్తాన్ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. కాశ్మీర్ ను ఆక్రమించుకోవాలన్న కుత్రతో పాకిస్తాన్ తన సైన్యాన్ని ‘ఆపరేషన్ బదర్’ పేరిట ఉగ్రవాదులను భారత్ లోకి అక్రమంగా పంపించింది. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఒప్పందం ప్రకారం యుద్ధం చేయలేదు.

Written By: Chai Muchhata, Updated On : July 26, 2023 12:09 pm

Kargil Vijay Diwas

Follow us on

Kargil Vijay Diwas: భారత్ కు దయాది దేశం పాకిస్తాన్ తో నిత్యం ఏదో ఒక విషయంలో కయ్యం ఉంటూనే ఉంటుంది. కానీ పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కార్గిల్ పోరాటం ఒకటి. భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉన్న కార్గిల్ లో జరిగిన యుద్ధంలో జరిగిన విజయానికి ప్రతీకగా జూలై 26ప కార్గిల్ దివన్ ను జరుపుకుంటాం. ఈ సందర్భంగా దేశ నలుమూలల జాతీయ జెండాను ఎగురవేసి వేడుకలు నిర్వహించుకుంటారు. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధం గురించి అప్పటి వారికి తెలుసు. కానీ నేటి యువకుల్లో చాలా మందికి దీని గురించి తెలియదు. అసలు కార్గిల్ దివస్ ను ఎందుకు జరుపుకుంటాం?

భారత్, పాకిస్తాన్ మధ్య 1999లో ఉగ్రవాదుల విషయంలో ఒప్పందం జరిగింది. కానీ పాకిస్తాన్ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. కాశ్మీర్ ను ఆక్రమించుకోవాలన్న కుత్రతో పాకిస్తాన్ తన సైన్యాన్ని ‘ఆపరేషన్ బదర్’ పేరిట ఉగ్రవాదులను భారత్ లోకి అక్రమంగా పంపించింది. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఒప్పందం ప్రకారం యుద్ధం చేయలేదు. కానీ పాకిస్తాన్ కవ్వింపు చర్యలతో యుద్ధం చేయక తప్పలేదు. దీంతో కార్గిల్ జిల్లాలో 1999 మే 3న రెండు దేశాల మధ్యయుద్ధం ప్రారంభమైంది. దీనికి భారత్ ‘ఆపరేషణ్ విజయ్ ’ అనే కోడ్ ను పెట్టకుంది.

మంచు పర్వతాల్లో దాదాపు 60 రోజుల పాటు జరిగిన ఈ యుద్ధంలో ఇరు దేశాలకు చెందిన చాలా మంది సైనికులు చనిపోయారు. చివరికి జూలై 26న భారత్ భూభాగంలోకి ప్రవేశించిన పాక్ సైన్యాన్ని భారత్ సైన్యం తిప్పి కొట్టింది. దీంతో ఆ రోజున భారత్ తన భూభాగాన్ని కాపాడుకోగలిగింది. అప్పటి నుంచి ప్రతి జూలై 26న కార్గిల్ విజయ దినోత్సవం గా ‘కార్గిల్ దివస్’ వేడుకలు నిర్వహించుకుంటున్నారు.

భారత్, పాకిస్తాన్ ల మధ్య అంతకుముందు జరిగిన 1971 భారీ యుద్ధం తరువాత ఇది జరగడంతో దీనిపై ప్రపంచ దేశాలు ఉత్కంఠతో ఎదురుచూసశాయి. అయితే ఈ ఆపరేషన్ లో భారత్ విజయం సాధించడంతో అప్పటి నుంచి భారత్ కు కొన్ని దేశాలు మితృత్వంగా ఉంటున్నాయి. 1999 నుంచి కూడా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంటుంది. కానీ భారత్ అప్డేట్ వెఫన్లు, మిషైల్స్ ను రెడీ చేసుకుంటుండడం చూసి పాకిస్తాన్ వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది.