Homeజాతీయ వార్తలుKaleshwaram Project: లక్ష కోట్ల కాళేశ్వరం ఎందుకు మునిగినట్టు?

Kaleshwaram Project: లక్ష కోట్ల కాళేశ్వరం ఎందుకు మునిగినట్టు?

Kaleshwaram Project: ఏళ్లనాటి చరిత్ర ఉన్న కడెం ప్రాజెక్టు అంత స్థాయిలో గోదావరి వచ్చినా, 24వ గేటు పని చేయక పోయినా కొట్టుకుపోలేదు. నీరు డ్యాం పై నుంచి పొంగిపొర్లినా చెక్కుచెదరలేదు. పదేళ్ల క్రితం శ్రీశైలానికి ఇదే స్థాయిలో వరద వచ్చినా డ్యాం అలాగే నిలబడింది. అప్పుడెప్పుడో నిర్మించిన కరకట్ట నేటికీ భద్రాచలానికి శ్రీరామరక్షలాగా నిలుస్తోంది. ₹లక్ష కోట్ల ఖర్చు.. 80 వేల పుస్తకాలు చదివిన నైపుణ్యం.. మేఘా కంపెనీ ఇంజనీరింగ్ కౌశలం ఏమైపోయినట్టు? ఒక భారీ వర్షానికే మోటార్లు మునిగిపోయి, రక్షణ గోడలు కూలిపోతే మున్ముందు ప్రాజెక్టు పరిస్థితి ఏంటి? తెలంగాణ జీవధార ఇంతటి అభాసు పాలు కావడం ఏంటి? ఇప్పుడు మోటర్లు పాడైపోవడం వల్ల 400 కోట్ల ఖర్చు ఎవరు భరిస్తారు? ప్రతిపక్షాలు విమర్శలు చేయవచ్చు గాక.. మీడియా చేస్తున్న తప్పుల్ని ఎత్తిచూపవచ్చును గాక.. కానీ వీటన్నింటికీ మించి పాలకుడికి రాజ ధర్మం అంటూ ఉండాలి. చేపట్టే ప్రతి పని దీర్ఘకాలిక ప్రయోజనం ఇచ్చేదై ఉండాలి. ఖర్చు పెట్టే ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడేదై ఉండాలి.

Kaleshwaram Project
Kaleshwaram Project

పేరుకే మానస పుత్రిక

కాలేశ్వరం.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన మానస పుత్రిక పరిచయం చేసుకున్న ఎత్తిపోతల పథకం. నిండు శాసనసభలో జరదృశ్యం పేరిట ఆవిష్కరించిన అద్భుతం. డిస్కవరీ ఛానల్ లో టీఆర్ఎస్ డబ్బా కొట్టుకున్న బహుళార్థక సాధక పథకం. కానీ పైన చెప్పినంత గొప్పగా కాలేశ్వరం లేదా? అసలు కాలేశ్వరంలో ఇన్ని లోపాలు ఎందుకు బయటపడుతున్నాయి? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్రానికి కాలేశ్వరం ప్రాజెక్టు ఒక తెల్ల ఏనుగేనా? నష్టం ఈ స్థాయిలో ఉంటే వర్షాలు పడ్డప్పుడు మోటర్లు మునుగుతాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేటీఆర్ చెప్పడం ఏంటి? ఇంజనీరింగ్ లోపాలపై విచారణ నిర్వహించకుండా కెసిఆర్ క్లౌడ్ బరెస్టింగ్, విదేశాలకు కుట్ర అంటూ తల తోక లేని ఆరోపణలు చేయడం ఏంటి? వరద తాకిడి ఉన్న విషయాన్ని అధికారులు ముందుగా ఎందుకు గుర్తించలేకపోయారు? పంప్ హౌస్ లు మునిగిన ప్రాంతానికి మీడియాను ఎందుకు రానివ్వడం లేదు? ఇప్పుడు అందరి నోటా వ్యక్తం అవుతున్న ప్రశ్నలు ఇవి.

Also Read: CM KCR Fired On Forest Department: ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ లో దొంగలు.. కేసీఆర్ క్లాస్ పీకాడా?

వాస్తవానికి తెలంగాణకు భారీ వర్ష సూచన ఉందని శాఖ ఎప్పటినుంచో మొత్తుకుంటున్నది. కానీ ఘనత వహించిన నీటిపారుదల శాఖ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఫలితంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా గోదావరి క్యాచ్ మెంట్ ఏరియాలో భారీ వర్షాలు కురిసాయి. ఫలితంగా వరద ఉధృతి కానీ వీని ఎరగని స్థాయిలో పెరిగింది. ఎంతటి వరదనైనా తట్టుకుంటుంది, చైనా త్రీ గోర్జెస్ ప్రాజెక్టుతో పోటీపడుతుందని నాడు ఎత్తిపోతల పథకం ప్రారంభంలో కేసీఆర్ చెప్పారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. అసలు వరద వల్ల మోటార్లు ముని పోవడం ముమ్మాటికి అధికారులు నిర్లక్ష్యమే. ఇక గోదావరి నుంచి కన్నెపల్లిలోని లక్ష్మి పంప్ హౌస్ అప్రోచ్ కెనాల్ ఫోర్ బే వరకు భారీగా వరద వచ్చిన విషయాన్ని అధికారులు ఆలస్యంగా గుర్తించారు. వెంటనే ఒక మోటార్ ను రన్ చేసి వరద నీటిని గ్రావిటీ కెనాల్ లోకి పంపింగ్ చేశారు. అదే రోజు రాత్రి(బుధవారం) వరకు మరో రెండు మోటార్లను రన్ చేసి వరద నీటిని కొంతైనా లిఫ్ట్ చేయాలని ఏర్పాట్లు చేశారు. కానీ రాత్రివేళ లక్ష్మి పంప్ హౌస్ కు వచ్చే కరెంటు సరఫరా ఆకస్మాత్తుగా నిలిచిపోయింది. వాస్తవానికి లక్ష్మి పంప్ హౌస్ కు కావలసిన విద్యుత్తును మంచిర్యాల జిల్లా సింగరేణి జైపూర్ ప్లాంట్ నుంచి అందిస్తున్నారు. అయితే కరెంటు సరఫరా అకస్మాత్తుగా నిలిచిపోవడంతో ఉన్న ఒక్క మోటార్ కూడా రన్ కాలేదు. పైగా అదే రోజు(గురువారం) మరుసటి ఉదయాన్నుంచి విద్యుత్ పునరుద్ధరణకు ట్రాన్స్ కో అధికారులు ప్రయత్నాలు చేస్తుండగానే, మధ్యాహ్నం సమయంలో గోదావరి వరద తాకిడికి పంప్ హౌస్ రక్షణ కూడా పూర్తిగా కూలిపోయింది.

Kaleshwaram Project
Kaleshwaram Project

దీంతో వరద నీరు ఆకస్మాత్తుగా మోటార్లలోకి చేరుకుంది. వాస్తవానికి ఇలాంటి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు రక్షణ గోడలు చాలా ముఖ్యం. కానీ రక్షణ గోడల నిర్మాణంలో నాణ్యత లోపం వల్ల కూలిపోయాయి. పైగా నిర్మాణంలోనే రక్షణ గోడలకు కొద్దికొద్దిగా లీకేజీలు ఉన్నాయి ఈ విషయాన్ని అప్పట్లో ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. వాస్తవానికి గ్రావిటీ పంప్ హౌస్ ను నదికి కొంత దూరంలో నిర్మించాలి. గోదావరికి అతి సమీపంగా పంప్ హౌస్ నిర్మించడంతో భవిష్యత్తులో భారీగా వరదలు వస్తే ఎలా ఎదుర్కోవాలో అధికారుల దగ్గర సమాధానం లేదు. మరోవైపు లక్ష్మీ పంప్ హౌస్ కు సంబంధించిన ఇంజనీర్లు సిబ్బంది అందులో ఉండగానే ఫోర్ బే గోడ నుంచి లీకేజీలు పెరిగాయి. వారంతా ఒక్కసారిగా మోటార్ల దగ్గర నుంచి వెళ్లిపోయారు. లేకుంటే పరిస్థితి ఊహించుకోవడానికే భయంగా ఉండేది.

సరస్వతి పంప్ హౌస్ పరిస్థితి కూడా అదే

ఇక పెద్దపల్లి జిల్లాలో కాలేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించిన సరస్వతీ పంప్ హౌస్ మోటార్లు కూడా నీట మునిగాయి. మంథని మండలం కాసిపేట వద్ద నిర్మించిన సరస్వతి పంప్ హౌస్ లో మోటార్ల మీద సగం వరకు నీళ్లు చేరి ఉన్నాయి. జల్లారం వాగు ఉధృతి వల్ల సరస్వతి పంప్ హౌస్ మునిగింది.సుందిళ్ల ముస్త్యాల, గుంజపాడు నుంచి వచ్చే వాగునీటిని సరస్వతి బ్యారేజ్ దిగువున గోదారిలోకి మళ్లించేలా ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అధికారులు అప్పట్లో చర్యలు తీసుకున్నారు. ఇందుకు చిన్న వంతెన కూడా నిర్మించారు. అయితే వాగుకు వరద పెరగడంతో నీళ్లన్నీ ఉపరితలం వరకు వచ్చి అవి పంపవలసిన ప్రాంతానికి వచ్చాయి. వరదలు వచ్చినప్పుడు ఈ వాగు నీళ్లు పంప్ హౌస్ వద్దకు వస్తాయని ఇంజనీరింగ్ అధికారులు అంచనా వేయకపోవడం మహా తప్పిదం. ఇలా చెప్పుకుంటూ పోతే కాలేశ్వరం ప్రాజెక్టులో అడుగునా లోపాలే. నిర్మించి నాలుగేళ్లు కాకముందే రిపేర్లు వస్తుంటే ఇక మున్ముందు పరిస్థితి ఏంటి అనేది అంతు పట్టకుండా ఉంది. ఓ నాగర్జునసాగర్, శ్రీశైలం శ్రీరాంసాగర్, జూరాల, కడెం ప్రాజెక్టు.. వీటి నిర్మాణ కోసం ప్రభుత్వం పెద్దగా నిధులు ఖర్చు చేయకపోయినా సింహభాగం ఆయకట్టు వీటికిందే సాగువతోంది. ఇంకా భవిష్యత్తులోనూ ఇవి సేవలు అందించగలవు. కానీ లక్ష కోట్లు ఖర్చుపెట్టిన కాళేశ్వరం ఆది లోనే హంసపాదు లాగా సమతుల గురవడం ముమ్మాటికీ 80 వేల పుస్తకాలు చదివిన జ్ఞానానికి పరాకాష్ట.

Also Read:Hardik Pandya: హార్ధిక్ పాండ్యా తోపు.. నువ్వు గొప్పోడివి సామీ!

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

1 COMMENT

Comments are closed.

Exit mobile version