CM KCR Fired On Forest Department: తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. చెరువులకు గండ్లు పడ్డాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ప్రాజెక్టుల్లో నీరు చేరడంతో గేట్లు ఎత్తారు. వరద ముంపు పరిస్థితిని సీఎం కేసీఆర్ ఆదివారం ఉమ్మడి వరంగల్, భద్రాచలంలో పర్యటించారు. భద్రాచలంలో గోదావరి ఉధృతిని పరిశీలించారు. ప్రజలతో మాట్లాడారు. ఏడాదిలోగా గోదావరి వరదలకు పరిష్కార చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ముంపు గ్రామాల ప్రజలకు వేరే చోట పక్కా ఇళ్లు కట్టించాలని సూచించారు.
గోదావరి వరదలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని చెప్పారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని చర్యలు చేపడతామని తెలిపారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం వర్షాలు బాగా కురిసినందున సమస్యలు వచ్చాయి. దీంతో అధికార యంత్రాంగం ప్రజలకు సరైన వసతులు కల్పించాలని పేర్కొన్నారు. ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే సీతక్కతో కలిసి పర్యటించారు. బాధితులకు భరోసా కల్పించారు.
Also Read: Viral Video: సైనికుడి పాదాలకు వందనం.. వైరల్ అవుతున్న చిన్నారి వినయం
అనంతరం ఏటూరునాగారంలోని ఐటీడీఏ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. అటవీ శాఖలో దొంగలున్నారు. చెట్లన్నీ మాయమవుతున్నాయి. అటవీ సంపద రోజురోజుకు తరిగిపోతోంది. అసలు చెట్లే లేకుండా పోతున్నాయి. ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టడు అన్నట్లు అటవీ శాఖలోని దొంగలే స్మగ్లర్లతో చేతులు కలిపి అటవీ సంపదను నాశనం చేస్తున్నారు. ఫలితంగా అడవులు అంతరించిపోతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్నాయి. దీంతో మానవ మనుగడ ప్రమాదంలో పడుతోంది. జనాభా ఇలాగే పెరుతుంటే భవిష్యత్ తరాలకు కష్టమే అని తెలుస్తోంది.
అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అడవిలో రోడ్లు వేయొద్దని, స్తంభాలు నాటొద్దని అడ్డు చెబుతున్న అధికారులపై నిప్పులు చెరిగారు. ఇలా ఆక్షేపణ చేస్తే అభివృద్ధి పనులు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. అడవికి నష్టం కలిగించే చర్యలు ఎవరు తీసుకోరన్నారు. కేవలం ప్రజా అవసరాల కోసమే పలు కార్యక్రమాలు చేపడుతున్నా అటవీ అధికారులు కాదనడం సమంజసం కాదు. దీంతో ప్రజలకు ఎలా సౌకర్యాలు అందుతాయో చెప్పాలన్నారు. అన్నిటికి అడ్డు చెప్పడమే పరిష్కారం కాదని ప్రజల కోసం కొన్నింటిని త్యాగం చేయక తప్పదు. అధికారులపై సీఎం మండిపడ్డారు. పనులు జరిగేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.