https://oktelugu.com/

Urvashi Rautela: ‘సమంత’కి ‘ఊర్వశి’కి మధ్య సంబంధం లేదట !

Urvashi Rautela: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో వచ్చిన ‘పుష్ప’ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. అయితే, ఈ సినిమాలోని ఒక స్పెసల్ సాంగ్ కోసం బాలీవుడ్‌ బ్యూటీ ‘ఊర్వశి రౌటెలా’ను తీసుకున్నామని, ఇప్పటికే ఆ సాంగ్ ను షూట్ కూడా చేశామని.. ఇక ఆ సాంగ్ లో ఊర్వశి రౌటెలా’ డ్యాన్స్ అదిరిపోయిందని.. ఆ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సుకుమారే చెప్పుకొచ్చాడు. అయితే, ఆ తర్వాత సమంత […]

Written By:
  • Shiva
  • , Updated On : December 18, 2021 / 10:25 AM IST
    Follow us on

    Urvashi Rautela: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో వచ్చిన ‘పుష్ప’ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. అయితే, ఈ సినిమాలోని ఒక స్పెసల్ సాంగ్ కోసం బాలీవుడ్‌ బ్యూటీ ‘ఊర్వశి రౌటెలా’ను తీసుకున్నామని, ఇప్పటికే ఆ సాంగ్ ను షూట్ కూడా చేశామని.. ఇక ఆ సాంగ్ లో ఊర్వశి రౌటెలా’ డ్యాన్స్ అదిరిపోయిందని.. ఆ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సుకుమారే చెప్పుకొచ్చాడు.

    Urvashi Rautela

    అయితే, ఆ తర్వాత సమంత నుంచి స్పెషల్ సాంగ్ రావడంతో.. ఇక ‘ఊర్వశి రౌటెలా’ పుష్పలో కనిపించదు అనుకున్నారు. తాజాగా సినీ సర్కిల్స్ లో వినిపిస్తోన్న టాక్ ప్రకారం.. ‘ఊర్వశి రౌటెలా’ సాంగ్ ఇప్పటికే పూర్తి అయింది. పుష్ప రెండో పార్ట్ లో ఈ సాంగ్ రానుంది. సమంతకు ‘ఊర్వశి’కి మధ్య సంబంధం లేదట. ఇద్దరికీ చెరో సాంగ్ ఉందట. ఇక తన సాంగ్ కోసం తాను ఎంతో ఎదురుచూస్తున్నాను అంటూ ‘ఊర్వశి రౌటెలా’ కూడా తెగ ఎగ్జైట్ అయిపోయింది.

    ముఖ్యంగా బన్నీ అంటే తనకు ఎంతో ఇష్టం అంటుంది ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీ. అల్లు అర్జున్ డ్యాన్స్ కి ఫ్లాటైపోయింది అట. నిజానికి డ్యాన్స్ పరంగా బాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్ ‘ఊర్వశి రౌటెలా’నే. తన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో తనకంటూ అక్కడ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక తనకు తెలుగు చిత్రాల్లో అవకాశాలు వస్తే.. కచ్చితంగా తెలుగు సినిమాలు చేస్తాను అంటుంది.

    Also Read: Bheemla Nayak: బైక్​రైడ్​ చేస్తూ ‘భీమ్లానాయక్’​ వీడియో.. నెట్టింట వైరల్

    అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ఎలాగూ ఒక స్పెషల్ సాంగ్ చేస్తోంది కాబట్టి.. మిగిలిన తెలుగు సినిమాల్లో ‘ఊర్వశి రౌటెలా’కి అవకాశం వస్తోందేమో చూడాలి. ముఖ్యంగా ‘ఊర్వశి రౌటెలా’ స్పెషల్ సాంగ్స్ చేయడంలో ఆమెకు ప్రత్యేక టాలెంట్ ఉంది. ఆమె డ్యాన్స్ కోసం మాస్ ప్రేక్షకులు ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు.

    Also Read: Hit 2 Movie: అడివి శేష్ బర్త్ డే కానుకగా “హిట్ 2” మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్…

    Tags