పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం సామర్ధ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచి రాయలసీమ జిల్లాలకు రోజుకు 3 టి.ఎం.సీల నీటిని తరలించాలనే ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్రంలో అన్ని ప్రతిపక్ష పార్టీలు స్పందించినా తెలుగుదేశం పార్టీ తన వైఖరిని వెల్లడించలేదు. ఏ విషయంపై ప్రభుత్వం జి.ఓ ఇచ్చి తొమ్మిది రోజులయ్యింది. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాయలసీమకు నీళ్లు ఇవ్వాల్సిందే నాని, ఇందుకు ప్రభుత్వం ఏ రకమైన పోరాటంమైనా చేసినా తాము మద్దతు ఇస్తామని చెప్పారు. సీపీఐ, సిపిఎం పార్టీలు రాయలసీమకు నీటిని తరలించాలని, ఈ అంశంపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని కోరారు. టీడీపీ, జనసేన మాత్రం ఎప్పటి వరకూ తమ వైఖరిని వెల్లడించలేదు.
పోతిరెడ్డిపాడు విషయంలో టీడీపీ వ్యవహరిస్తున్న తీరును రాయలసీమ వాసుల సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నారు. ఈ పార్టీలు అమరావతి కోసం ఆందోళనలు చేశాయి, అది కేవలం19 గ్రామాలకు ప్రయోజనం. కానీ రాయలసీమలోని 1.7 కోట్ల మంది జీవితకాలపు సమస్యను తీర్చే నిర్ణయానికి మద్దతు ఇవ్వడంలేదు. విశాఖ ఎల్.జి దుర్ఘటనపై స్పందించాయి, ఇది కేవలం ఐదారు గ్రామాలకు పరిమితమైన సమస్యే అని పేర్కొంటున్నారు.
మరోవైపు గత సార్వత్రిక ఎన్నికల ముందు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం నేతలు పోతిరెడ్డిపాడు విషయంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ను ప్రతి రోజు విరుచుకుపడ్డారు. కేసీఆర్ తో కుమ్మక్కై రాయలసీమలో సాగినీటి ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారని విమర్శించారు. పోలవరానికి జగన్ కేసీఆర్ తో కలిసి అడ్డుపడున్నారని అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. కొద్ది రోజు వేచి చూసే ధోరణి అవలంబించాలని బాబు భావిసుండటంతో ఈ విషయంలో టీడీపీ మౌనం వహిస్తుందని
తెలుస్తోంది.
వైసీపీ నాయకులు ఇప్పటికే టీడీపీ తన వైఖరి ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నిస్తున్నారు. అయినప్పటికీ ఆ పార్టీ నాయకులు ఎవరు స్పందించలేదు. నిన్న జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ అంశంపై చర్చించ జరగక పోవడం అనేక సందేహాలకు తావిస్తోంది. కనీసం సోషల్ మీడియాలో సైతం ఎవ్వరూ స్పదించలేదు. ఇది ఇద్దరి సీఎంల నాటకమని తెలంగాణా టీడీపీ నేతలతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ మీడియాకు వెల్లడించారు. ఈ అంశంపై రెండు ప్రభుత్వాలు తీసుకునే ఏ నిర్ణయమైనా రెండు రాష్ట్రాల మేలు చేసేలా, అభివృద్ధికి దోహదపడేలా ఉండాలని సూచించారు. దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు ఇప్పటికీ రెండుకళ్ళ సిద్దాంతాన్ని అనుసరిస్తున్న విషయం స్పష్టం అవుతోంది.