యువతి ప్రాణం తీసిన లాక్ డౌన్..!

కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కొందరికి శాపంగా మారింది. తప్పనిసరి పరిస్థితిలో మరో గ్రామానికి వెళ్లినా అక్కడ వాలంటీర్ల సాహాయంతో వారిని గుర్తించి వెనక్కి పంపుతున్న సంఘటనలు ఏపీలో చోటు చేసుకున్నాయి. మరోవైపు లాక్ డౌన్ వల్ల తెలంగాణా నుంచి ఏపీకి రావడానికి అనుమతి లేకపోతే పోలీసులు అంగీకరించక పోవడంతో ఆ తల్లిదండ్రులు కుమార్తెను హైదరాబాద్ లొనే ఉండాలని సూచించారు. దీంతో మనస్తాపానికి గురైన వీర వల్లిక అనే యువతి, తానుండే అపార్టుమెంట్ […]

Written By: Neelambaram, Updated On : May 14, 2020 12:05 pm
Follow us on

కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కొందరికి శాపంగా మారింది. తప్పనిసరి పరిస్థితిలో మరో గ్రామానికి వెళ్లినా అక్కడ వాలంటీర్ల సాహాయంతో వారిని గుర్తించి వెనక్కి పంపుతున్న సంఘటనలు ఏపీలో చోటు చేసుకున్నాయి. మరోవైపు లాక్ డౌన్ వల్ల తెలంగాణా నుంచి ఏపీకి రావడానికి అనుమతి లేకపోతే పోలీసులు అంగీకరించక పోవడంతో ఆ తల్లిదండ్రులు కుమార్తెను హైదరాబాద్ లొనే ఉండాలని సూచించారు. దీంతో మనస్తాపానికి గురైన వీర వల్లిక అనే యువతి, తానుండే అపార్టుమెంట్ 15వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మణికొండలో కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే కృష్ణా జిల్లా నందిగామ ప్రాంతానికి చెందిన వీర వల్లిక అనే యువతి, మూడు నెలల క్రితం హైదరాబాద్ కు వచ్చి, ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ, ల్యాంకో హిల్స్ లో నివాసం ఉంటోంది. లాక్ డౌన్ కారణంగా కార్యాలయం మూత పడటంతో హైదరాబాద్ లోనే చిక్కుకుపోయింది. ఆమె స్వగ్రామానికి వెళ్లే ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీంతో తనను ఎలాగైనా తీసుకుని వెళ్లాలని తల్లిదండ్రులను కోరింది. ఈ సమయంలో రావద్దని, గ్రామంలో సైతం కొత్త వారిని రానివ్వడం లేదని, లాక్ డౌన్ ముగిసేంత వరకూ హైదరాబాద్ లోనే ఉండాలని వారు సూచించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె, ఒంటరితనాన్ని భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.

ఇదిలా ఉండగా కరోనా కాలంలో కన్న తండ్రిని కొడుకులు ఇంటికి రానివ్వని ఈ సంఘటన గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన ఓ వృద్ధుడు తూర్పుగోదావరి జిల్లాలో ఉంటున్న తన సోదరుడు ఇంటికి మార్చిలో వెళ్ళాడు. అనంతరం లాక్ డౌన్తో ఇన్నాళ్లు అక్కడే ఉండిపోయాడు. ఈ నెల 10వ తేదీన తెనాలి వచ్చాడు. కొడుకులు ఇంట్లోకి రానివ్వకపోవడంతో రోడ్డుపైనే ఉన్నాడు. స్థానిక సి.ఐ రాజేష్ కుమార్ కుమారులకు కౌన్సెలింగ్ ఇచ్చి తండ్రిని ఇంటికి తీసుకువెళ్లేలా చర్యలు తీసుకున్నారు.