18 నుంచి బస్సులు ప్రారంభం!

ఆంధ్రప్రదేశ్ లో ఈనెల పద్దెనిమిది నుంచి ఆర్టిసి బస్ లను నడపడానికి రంగం సిద్దం అవుతోంది. రైళ్లలో తీసుకున్నట్లుగానే బస్ లలో కూడా జాగ్రత్తలు తీసుకుని నడపాలని అధికారులు తలపెట్టారు. బస్సులు నడిపేందుకు సంసిద్ధంగా ఉండాలంటూ ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ రాష్ట్రవ్యాప్తంగా రీజనల్‌ మేనేజర్లకు సర్క్యులర్‌ జారీ చేశారు. దీంతో మార్చి 22 నుంచి డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కే అవకాశం ఉంది. ఆర్టీసీకి భారీ ఆదాయం తెచ్చిపెట్టే అమరావతి, గరుడ, గరుడ ప్లస్‌, […]

Written By: Neelambaram, Updated On : May 14, 2020 11:50 am
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో ఈనెల పద్దెనిమిది నుంచి ఆర్టిసి బస్ లను నడపడానికి రంగం సిద్దం అవుతోంది. రైళ్లలో తీసుకున్నట్లుగానే బస్ లలో కూడా జాగ్రత్తలు తీసుకుని నడపాలని అధికారులు తలపెట్టారు. బస్సులు నడిపేందుకు సంసిద్ధంగా ఉండాలంటూ ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ రాష్ట్రవ్యాప్తంగా రీజనల్‌ మేనేజర్లకు సర్క్యులర్‌ జారీ చేశారు.

దీంతో మార్చి 22 నుంచి డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కే అవకాశం ఉంది. ఆర్టీసీకి భారీ ఆదాయం తెచ్చిపెట్టే అమరావతి, గరుడ, గరుడ ప్లస్‌, వెన్నెల స్లీపర్‌, నైట్‌ రైడర్‌, ఇంద్ర, సూపర్‌ లగ్జరీ, అలా్ట్ర డీలక్స్‌, ఎక్స్‌ప్రెస్‌ తదితర హైఎండ్‌ సర్వీసుల్లో 50 శాతం మందినే అనుమతిస్తారు.