బాబు ‘బీసీ’ రాగం ఎందుకు సక్సెస్ కాలేదంటే..!

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు సందర్భంగా చంద్రబాబు అండ్ కో బీసీ కార్డును ప్రయోగించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టె ప్రయత్నం చేశారు. బిసిల చేత “నేను బీసీని నన్ను అరెస్టు చేయండి” అంటూ ప్లకార్డులతో ఫొటోలు తీసి పార్టీ ట్విట్టర్ ఖాతాలో పోస్టులు పెట్టారు. టీడీపీ, చంద్రబాబు, లోకేష్ ట్విట్టర్ ఖాతా ప్రొఫైల్ పిక్ ను “ఉయ్ స్టాండ్ విత్ అచ్చెన్నాయుడు” అని ఉన్న అచ్చెన్నాయుడు ఫొటోను మార్చారు. అటు సోషల్ మీడియాలోనూ, ఇటు ప్రెస్ మీట్ […]

Written By: Neelambaram, Updated On : June 19, 2020 10:03 am
Follow us on


మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు సందర్భంగా చంద్రబాబు అండ్ కో బీసీ కార్డును ప్రయోగించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టె ప్రయత్నం చేశారు. బిసిల చేత “నేను బీసీని నన్ను అరెస్టు చేయండి” అంటూ ప్లకార్డులతో ఫొటోలు తీసి పార్టీ ట్విట్టర్ ఖాతాలో పోస్టులు పెట్టారు. టీడీపీ, చంద్రబాబు, లోకేష్ ట్విట్టర్ ఖాతా ప్రొఫైల్ పిక్ ను “ఉయ్ స్టాండ్ విత్ అచ్చెన్నాయుడు” అని ఉన్న అచ్చెన్నాయుడు ఫొటోను మార్చారు. అటు సోషల్ మీడియాలోనూ, ఇటు ప్రెస్ మీట్ లలోను ప్రభుత్వం బీసీలను వేధిస్తోందని చంద్రబాబు అండ్ కో చెప్పుకొచ్చింది. ఆ పార్టీ ఇప్పటికీ అదే ప్రచారాన్ని కొనసాగిస్తోంది. అయితే చంద్రబాబు బీసీ ప్లాన్ సక్సెస్ అవ్వకపోవడానికి కారణాలు అనేకం కనిపిస్తున్నాయి. వీటిలో కొన్ని స్వయం కృతాపరాధాలు ఉండగా మరొకొన్ని అధికార పక్షం ఎత్తుగడలు ఉన్నాయి.

సెల్ ఫోన్ వీడియో.. అడ్డంగా బుక్కైన నారా లోకేష్

చంద్రబాబు స్వయం కృతాపరాధం ఏంటంటే బీసీ నాయకుడైన అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులను టీడీపీ అధినేత, ఆయన తనయుడు ఎవ్వరూ ఇంటికి వెళ్లి పరామర్శించలేదు. కేవలం ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పారంతే. అనంతపురానికి చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డి అతని కొడుకు అరెస్టు అయితే ఆయన కుటుంబ సభ్యలను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అనంతపురం వెళ్లి మరీ పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఇది బీసీ వర్గాల్లో అసంతృప్తికి కారణమైంది.

పంతం నెగ్గించుకున్న టీడీపీ..!

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు బీసీ కార్డు ఎత్తులను ప్రభుత్వం చిత్తు చేసింది. టిటిడిలో సన్నిధి గొల్లలకు వంశ పారంపర్య వారసత్వానికి అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు మాజీ మంత్రి ఆ అచ్చెన్నాయుడు అరెస్ట్ జరిగిన మరుసటి రోజే జేసీ ప్రభాకర్ రెడ్డి అండ్ సన్స్ అరెస్ట్ చేసి ప్రభుత్వానికి అన్ని వర్గాలు సమానమనే సంకేతాలను ప్రజల్లోకి పంపింది. తాను బీసీ కావడంతోనే టీడీపీ అసత్యాలు ప్రచారం చేస్తోందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. శాసన మండలిలో జరిగిన గందర గోళంలో తాను అసభ్యంగా ప్రవర్తించలేదని తెలిపారు. ఈ ఆరోపణలు అవాసవమని మండలిలో రికార్డు చేసిన వీడియో చూస్తే స్పష్టం ఆమవుతుందన్నారు. టీడీపీ ప్రభుత్వ హాయంలోను తనపై బెట్టింగ్ కేసు పెట్టారని గుర్తు చేశారు. ఈ సంఘటనలతో బీసీలను తమకు వ్యతిరేకం కాకుండా ప్రభుత్వం ఎత్తుగడలు వేసింది.