https://oktelugu.com/

తెలంగాణపై పంజా విసురుతున్న కరోనా

తెలంగాణలో కరోనా మహమ్మరి పంజా విసురుతోంది. రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. నిన్న ఒక్కరోజే ఏకంగా 352 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ పరిధిలో గురువారం 302కేసులు నమోదుకాగా ముగ్గురు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,027కు చేరుకుంది. యాక్టివ్ కేసులు 2,531ఉండగా 3,301మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 195మంది మృతిచెందారు. ఎక్స్ క్లూజివ్: నీహారిక’కు కాబోయే భర్త ఎవరంటే..! […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 19, 2020 / 10:35 AM IST
    Follow us on


    తెలంగాణలో కరోనా మహమ్మరి పంజా విసురుతోంది. రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. నిన్న ఒక్కరోజే ఏకంగా 352 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ పరిధిలో గురువారం 302కేసులు నమోదుకాగా ముగ్గురు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,027కు చేరుకుంది. యాక్టివ్ కేసులు 2,531ఉండగా 3,301మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 195మంది మృతిచెందారు.

    ఎక్స్ క్లూజివ్: నీహారిక’కు కాబోయే భర్త ఎవరంటే..!

    లాక్డౌన్ సడలింపు అనంతరం కరోనా కేసులు లేని జిల్లాల్లోనూ కొత్త కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. కరోనా ఫ్రీగా ఉన్న వరంగల్ రూరల్ తదితర జిల్లాల్లో కొత్తగా కేసులు నమోదవడం చూస్తుంటే వైరస్ ఏవిధంగా వ్యాప్తి చెందుతుందో అర్థం చేసుకోవచ్చు. గురువారం నాడు రంగారెడ్డిలో 17, మేడ్చల్లో 10, మంచిర్యాలలో 4, జనగామలో 3, వరంగల్ అర్బన్ లో 3, భూపాలపల్లిలో 2, మహబూబ్ నగర్లో 2, మెదక్లో 2, నిజామాబాద్లో 2, సంగారెడ్డిలో 2, వరంగల్ రూరల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో పాజిటివ్ కేసు నమోదైందని తెలంగాణ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.

    తెలంగాణలో ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతున్నా కరోనా కట్టడికాకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా మహానగరంలో రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతుండంతో నగరవాసులు భయాందోళనకు గురవుతోన్నారు. ఈనేపథ్యంలో సీఎం కేసీఆర్ హైదరాబాద్లో 50వేల మంది కరోనా టెస్టులు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. కరోనా టెస్టులు చేపడుతున్న నేపథ్యంలో మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనాపై తొలి నుంచి పోరాడుతున్న వైద్యలు, సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తుంది.

    సెల్ ఫోన్ వీడియో.. అడ్డంగా బుక్కైన నారా లోకేష్

    లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు పర్యటనలు చేపట్టారు. దీంతో తెలంగాణలో ప్రజాప్రతినిధులు ఇటీవల కాలంలో కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే ముగ్గురు అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా నగర మేయర్ బొంతు రాంమోహ్మన్ రెండుసార్లు కరోనా బారినుంచి త్రుటిలో తప్పించుకున్నారు. అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి పీఏకు కరోనా సోకడంతో మంత్రి హోంక్వారైంట్లో ఉంటారు. కరోనా ఫ్రీగా ఉన్న సిద్ధిపేటలో ఇటీవల కరోనా కేసులు భారీగా నమోదుకావడంతో ప్రజలంతా ఇంటికే పరిమితయ్యారు.

    అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలు సైతం కరోనాబారిన పడి ఆస్పతుల్లో చికిత్స పొందుతుండగా మరికొందరు హోంక్వారంటైన్లో ఉంటున్నారు. వీరితోపాటు పలు జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాస్థాయి అధికారులకు కరోనా సోకడంతో ఆయా అధికారులు ఇంటి నుంచే పనులను చక్కబెడుతున్నారు. కరోనా నివారణకు ప్రభుత్వం ఎన్నిచర్యలు చేపట్టిన వైరస్ కట్టడి కాకపోవడంతో ప్రజలు ఇళ్లనుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు. ఈనేపథ్యంలో సీఎం కేసీఆర్ కరోనాను ఏవిధంగా కట్టడి చేస్తారో వేచి చూడాల్సిందే..!