https://oktelugu.com/

చైనాపై సర్జికల్స్ స్ట్రయిక్ తప్పదా?

భారత్-చైనా సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. సోమవారం రాత్రి గాల్వాలో జరిగిన ఘర్షణలో 20మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. ఈ ఘటన నేపథ్యం యావత్ దేశం చైనాకు తగిన ఆర్మీ తగిన గుణపాఠం చెప్పాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ప్రధాని మోదీ భారత జవాన్ల మరణం వృథాపోదని స్పష్టం చేశారు. సరిహద్దుల్లోని కమాండర్లకు పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునే అధికారం కల్పించారు. త్రివిధ దళాలను […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 19, 2020 / 09:47 AM IST
    Follow us on


    భారత్-చైనా సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. సోమవారం రాత్రి గాల్వాలో జరిగిన ఘర్షణలో 20మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. ఈ ఘటన నేపథ్యం యావత్ దేశం చైనాకు తగిన ఆర్మీ తగిన గుణపాఠం చెప్పాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ప్రధాని మోదీ భారత జవాన్ల మరణం వృథాపోదని స్పష్టం చేశారు. సరిహద్దుల్లోని కమాండర్లకు పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునే అధికారం కల్పించారు. త్రివిధ దళాలను సైతం సిద్ధం ఉండాలని ఆదేశించిన సంగతి తెల్సిందే. తాజాగా లడఖ్ బీజేపీ ఎంపీ జమ్యాంగ్ సేరింగ్ నాంగ్యాల్ చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.

    చైనా ఆరాటం నీళ్ళ కోసమా?

    2016లో పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రయిక్స్‌కు ముందు కూడా ప్రధాని మోదీ ఇలానే వ్యాఖ్యానించారని ఆయన గుర్తుచేశారు. 1962నుంచి ఇప్పటివరకు భారత్‌ను చైనా అనేకసార్లు మోసగించిందన్నారు. 1962యుద్ధంలో మనదేశానికి చెందిన 37,244 చ.కీ.మీ భూభాగాన్ని(అక్సాయ్ చిన్) ఆక్రమించిదని తెలిపారు. అక్సాయ్ చిన్ లడఖ్‌లోని భారత భూభాగమని ఆయన తేల్చిచెప్పారు. ఆ ప్రాంతాన్ని భారత్ తిరిగి స్వాధీనం చేసుకునే సమయం ఆసన్నమైందన్నారు. సరిహద్దుల్లో భారత జవాన్లు వీరమరణం పొందిన తరుణంలో ఇక చైనాను ఏమాత్రం ఉపేక్షించొద్దన్నారు. సరిహద్దు సమస్య శాశ్వత పరిష్కారం కావాల్సిందేనని డిమాండ్ చేశారు.

    చైనా వస్తువుల బహిష్కరణ సాధ్యమయ్యేనా?

    చైనా విషయంలో భారత ప్రధాని ఎలాంటి నిర్ణయం తీసుకున్న లఢక్ ప్రజలు దేశం, సైన్యం వెంటే ఉంటారని స్పష్టం చేశారు. చైనా సరిహద్దుల్లో మన జవాన్లు తరుచూ అమరులవడం లఢక్ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని తెలిపారు. లఢక్ ప్రజలతోపాటు యావత్ దేశం చైనాతో శాశ్వత పరిష్కారం కోరుకుంటోందన్నారు. ప్రస్తుతం భారత్‌లో ఉన్నది 1962 ప్రభుత్వం కాదని చైనాకు స్పష్టం చేశారు. భారత్ ను కవ్విస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదనే సందేశాన్ని ప్రధాని మోదీ ఇప్పటికే పంపించారన్నారు.

    తాజాగా లఢక్ ఎంపీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చైనాపై భారత్ మరో సర్జికల్ స్ట్రయిక్ చేపడుతుందా? అనే ఆసక్తి నెలకొంది. సరిహద్దుల్లో ఉద్రికత్త నేపథ్యంలో ఎప్పుడు జరుగుందోననే టెన్షన్ అందరినీ నెలకొంది.