Telangana Intellectuals- Jagan: అమరావతి రాజధాని విషయంలో జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయం విమర్శలపాలైంది. దేశవ్యాప్తంగా నేతలు జగన్ తీరును తప్పుపట్టారు. అయినా కూడా ఆయనలో మార్పురాలేదు. రాష్ట్రాన్ని రాజధాని లేకుండా నడిరోడ్డులో నిలిపారన్న అపవాదును ఆయన మూటగట్టుకున్నారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఆయన సహచర నాయకులు, అభిమానులు సైతం అమరావతిని ఏకైక రాజధాని చేయాలని ప్రకటించారు. అయినా ఆయన పెడచెవిన పెట్టారు. కానీ ఇప్పుడు తెలంగాణకు చెందిన మేథావులు, పలువురు మాజీ సీనియర్ న్యాయమూర్తులు హెచ్చరికలు జారీచేశారు. తీరు మార్చుకోకుంటూ మూల్యం చెల్లించుకుంటారని కూడా తేల్చిచెప్పారు. అమరావతి పరిరక్షణ సమితి ఉద్యమం ప్రారంభించి 900 రోజులు అయిన సందర్భంగా శనివారం విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో ‘హైకోర్టు తీర్పు – సర్కారు తీరు’ అనే అంశంపై జరిగిన చర్చావేదిక నిర్వహించారు. కార్యక్రమానికి మేథావులు, మాజీ న్యాయమూర్తులు వచ్చి రైతుల పోరాటానికి మద్దతు తెలిపారు.
రైతులను మోసం చేసిన వైసీపీ సర్కారుకు ఒక్కరోజు కూడా అధికారంలో ఉండే అర్హత లేదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాల గౌడ పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం ఎందుకుండాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. రాజధాని అమరావతిపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన చరిత్రాత్మక తీర్పును అమలు చేయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు చట్టబద్ధ పాలన సాగుతోందా? అని ప్రశ్నించారు.
లో జస్టిస్ గోపాలగౌడతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Also Read: TTD: భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక చర్యలు.. కాలినడక వచ్చే వారికి కార్పెట్
‘‘ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగించాలి. హైకోర్టు తీర్పులను అమలు చేసి గౌరవించాల్సిన బాధ్యత వాటిపై ఉందన్నారు.రైతులో పోరాటం కోర్టు తీర్పు నేపథ్యంలో అమరావతి నగరాన్ని అభివృద్ధి చేయడం మినహా ప్రభుత్వానికి ఇంకో దారి లేదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్, సీపీఐ నేత నారాయణ తేల్చి చెప్పారు.
ఇది రైతుల జీవనోపాధి, హక్కులకు సంబంధించిన అంశమన్న నేతలు ఉద్యమంతోనే వాటిని సాధించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని వారు స్పష్టం చేసారు. రైతుల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. న్యాయం కోసం ఉద్యమాలతో ముందుకెళ్లాల్సిందేనని, ప్రజా ఉద్యమాలు తప్ప వేరే మార్గం లేదన్నారు. ప్రజల్ని ఏడిపించి జగన్ ఏం సాధిస్తారని… సీపీఐ నేత నారాయణ జగన్‌ను ప్రశ్నించారు. ఏపీ మేధావుల మాటలను వినరు కానీ.. తెలంగాణ మేధావుల మాటలనైనా జగన్ వింటారేమో చూడాలి.