TTD: తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం టీటీడీ చర్యలు తీసుకుంటోంది. భక్తుల కోసం యుద్ధప్రాతిపదికన పనులు చేయాలని భావిస్తోంది. ఇటీవల మెట్ల మార్గాన్ని పరిశీలించిన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భక్తుల ఇబ్బందులను గమనించారు. ఎండల్లో వారు పడుతున్న ప్రయాసలు చూసి చలించిపోయారు. భక్తుల కోసం అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులను సూచించారు. ఎండలో కాళ్లు కాలుతూ మెట్లు ఎక్కేందుకు తిప్పలు పడుతున్న వారిని స్వయంగా పరిశీలించారు. దీంతో వారి బాధలు అడిగి తెలుసుకున్నారు. వారి కోసం టీటీడీ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.
మోకాలిమిట్ట నుంచి అక్కగార్ల గుడి వరకు కాలినడకన వచ్చే భక్తుల ఇబ్బందులు ప్రత్యక్షంగా చూశారు. వారు పడుతున్న బాధలు గమనించారు. తక్షణమే కార్పెట్ వేసి కాళ్లు కాలకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. తక్షణమే ఈ పనులు అమలు చేసి సమాచారం మళ్లీ తనకు చేరవేయాలని పేర్కొన్నారు. దీంతో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భక్తుల ఇబ్బందులు తీర్చేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెబుతున్నారు.
Also Read: Jagan Meets Modi: జగన్ విజ్ఞప్తుల కుప్ప.. అసలు స్పందనే లేని మోడీ
భక్తుల కాళ్లు కాలకుండా కార్పెట్ ఏర్పాటు చేయాలని చెబుతున్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో భక్తుల ఇబ్బందులు తీరే మార్గం కనిపిస్తోంది. ఈ మేరకు అధికారులు తగు చర్యలు తీసుకుని ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. వారి సంక్షేమం కోసం దృష్టి సారించాలని చెప్పారు. ఇందుకోసం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. సంబంధిత అధికారులు తక్షణమే పనులు పూర్తి చేయాలి. లేకపోతే ఎండలకు భక్తులకు తిప్పలు తలెత్తుతాయి.
కార్పెట్ పరిచి దానిపై నీళ్లు చల్లి చల్లగా ఉండేలా చూసుకోవాలి. కాలినడకన వచ్చే వారికి ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలి. ఎండాకాలమైనందున భక్తుల సంఖ్య పెరుగుతోంది. వారికి అనుగుణంగా సదుపాయాలు కల్పించాలి. లేకపోతే వారు బాధలు పడతారు. అందుకే వారి అభ్యున్నతి కోసం సకల చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కాలినడకన వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. భక్తులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.