Sneha Ullal: తెలుగు సినిమాల్లో హీరోయిన్లు ఎక్కువ కాలం నిలువలేకపోతున్నారు. తమ టాలెంట్ తో కొన్నేళ్లపాటు చిత్ర రంగాన్ని ఏలాలని చూసుకుంటున్నా నెరవేరడం లేదు. దీంతో ఒక్కో హీరోయిన్ కనీసం రెండు మూడేళ్లు కూడా తన కెరీర్ ను కొనసాగించలేకపోతున్నారు. దీంతో తెలుగు సినిమాల్లో హీరోయిన్లు ఒకటి రెండు సినిమాల్లోనే తమ ప్రభావం చూపిస్తూ తెరమరుగు అవుతున్నారు. ఎందరో సినిమాలకు కొత్తగా వస్తున్నారు. ఈ నేపథ్యంలో స్నేహ ఉల్లాల్ అప్పట్లో సంచలనం సృష్టించి ప్రస్తుతం తెరమరుగైంది. చేసినవి రెండు మూడు సినిమాలే అయినా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.

ఉల్లాసంగా.. ఉత్సాహంగా సినిమాతో తెలుగు తెరకు పరిచయమై తరువాత సింహాలో నటించింది. హిందీలో లక్కీ, నో టైం ఫర్ లవ్ చిత్రాల్లో నటించి మెప్పించింది. దీంతో తెలుగు సినిమాలకు దూరమైంది. కానీ స్నేహ ఉల్లాల్ సినిమాలకు దూరం కావడానికి వేరే కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెకు ఆరోగ్య రీత్యా ఇబ్బందులు వచ్చినట్లు చెబుతున్నారు. అందుకే సీనిమాలకు దూరంగా ఉంటుందని సినీవర్గాలు చెబుతున్నాయి.
Also Read: Telangana Intellectuals- Jagan: జగన్ కు తెలంగాణ మేధావులు సలహాలు ఎందుకిస్తున్నారు?

స్నేహ ఉల్లాల్ ను జూనియర్ ఐశ్వర్య రాయ్ గా పోలుస్తారు. అచ్చం అలాగే ఉండటంతో అభిమానులు ఎక్కువగా ఇష్టపడినట్లు తెలుస్తోంది. రక్తసంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ గా పిలుస్తారు. దీంతో ఆమె ఎక్కువ సేపు నిలబడ లేకపోతోందట. అందుకే సినిమాలకు దూరమైంది. అనతి కాలంలోనే అభిమానులను సంపాదించుకున్న నటిగా ప్రత్యేక గుర్తింపు పొందినా విధి వైపరీత్యంతో సినిమాలకు గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. పూర్తిస్థాయిలో ఆమెకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో ఆమె సినిమాల్లో నటించేందుకు ముందుకు రావడం లేదని సమాచారం.
Also Read:Sonali Bendre: అద్దె కట్టలేని సోనాలి బింద్రే అలాంటి సినిమాలు చేసిందా?
[…] […]