Telangana: తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు కర్ణాటక, మహారాష్ర్ట స్టేట్లలో ఉన్న కొన్ని తెలంగాణలో కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అక్కడ ఏళ్లుగా సమస్యలు తీరడం లేదు. దీంతో అక్కడ అభివృద్ధి మాట దేవుడెరుగు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాలు తెలంగాణలో కలవాలని చూస్తున్నాయి. ఇందుకోసం ధర్నాలు, రాస్తారోకోలు సైతం నిర్వహిస్తున్నాయి. ఇటీవల రాయచూర్ ను తెలంగాణలో కలపాలని బీజేపీ ఎమ్మెల్యే శివరాజ్ చేసిన ప్రతిపాదనపై అక్కడి ప్రజలు కూడా సుముఖంగా ఉండడంతో చర్చనీయాంశం అవుతోంది.

సమస్యలతో సతమతమవుతున్న ప్రాంతాలు తెలంగాణలో కలిసేందుకు నిర్ణయించుకుంటున్నాయి. నైజాం రాష్ర్టంలో కర్ణాటక, మహారాష్ర్టలోని కొన్ని ప్రాంతాలు తెలంగాణలో భాగాలుగా ఉండేవి. భాషా ప్రయుక్త స్టేట్ల కేటాయింపులో కన్నడ మాట్లాడే ప్రాంతాలను కర్ణాటకలో, మరాఠీ మాట్లాడే ప్రాంతాలను మహారాష్ర్టలో కలిపారు. దీంతో వారు ఇప్పుడు తెలంగాణలో కలిపితేనే అభివృద్ధి జరుగుతుందని భావించి ఇందులో కలిసేందుకు సిద్ధమవుతున్నాయి.
దీంతో అక్కడ డిమాండ్లు తారాస్థాయికి చేరి ప్రజలు కూడా తెలంగాణలో చేరేందుకే మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు ప్రజాప్రతినిధులు సైతం తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి ఇక్కడకు రావాలని ఆకాంక్షిస్తున్నారని మన నేతలు చెబుతున్నారు.
తెలంగాణలో విలీనం ప్రతిపాదన ప్రస్తుతం పెరుగుతోంది. పాలకులతో పాటు ప్రజలు కూడా దీనికి సై అంటుండటంతో కేంద్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాయచూర్ ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతున్న క్రమంలో కేంద్రం ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. సరిహద్దుల ప్రకారం విడిపోయినా ఆయా ప్రాంతాలు తెలంగాణలో భాగమేనని ఆయా ప్రాంతాల ప్రజలు మొర పెట్టుకుంటున్నారు.