ఎవరిది రైట్: రతన్ టాటా ఇలా.. అంబానీ అలా?

దేశంలోనే అపరకుబేరుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం ముఖ్యమా? లేక దేశ ప్రజలకు సేవ చేసి అంతకుమించిన ఆనందం పొందడం ముఖ్యమా? అంటే ఖచ్చితంగా అందరూ రెండోదారినే ఎంచుకుంటారు. కానీ మన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మాత్రం వ్యాపారం పరమావధిగా ప్రపంచాన్ని శాసిస్తున్నారు. వ్యాపార కోణంలో ఆయనది కరెక్టే. అయితే దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా మాత్రం ప్రజలకు సేవ చేయడంలో ముందుంటున్నారు. తాజాగా కరోనా బారినపడి ఆక్సిజన్ అందకుండా రోగుల పడుతున్న ఇబ్బందులు చూసి తన […]

Written By: NARESH, Updated On : April 23, 2021 12:03 pm
Follow us on

దేశంలోనే అపరకుబేరుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం ముఖ్యమా? లేక దేశ ప్రజలకు సేవ చేసి అంతకుమించిన ఆనందం పొందడం ముఖ్యమా? అంటే ఖచ్చితంగా అందరూ రెండోదారినే ఎంచుకుంటారు. కానీ మన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మాత్రం వ్యాపారం పరమావధిగా ప్రపంచాన్ని శాసిస్తున్నారు. వ్యాపార కోణంలో ఆయనది కరెక్టే. అయితే దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా మాత్రం ప్రజలకు సేవ చేయడంలో ముందుంటున్నారు.
తాజాగా కరోనా బారినపడి ఆక్సిజన్ అందకుండా రోగుల పడుతున్న ఇబ్బందులు చూసి తన పరిశ్రమల నుంచి ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేసి రతన్ టాటా గొప్ప ఉదారత చాటుకున్నారు. ఆయన చేసిన ఈ సేవకు ప్రత్యేకంగా ప్రధాని మోడీ కూడా ప్రశంసలు కురిపించడం విశేషం.
ఇక మరోవైపు దేశంలోనే నంబర్ 1 అపరకుమేరుడు ముఖేష్ అంబానీ సైతం తన ట్రస్టుల ద్వారా ఎంతో సాయంచేస్తున్నా.. ఈ కీలకమైన కరోనా కల్లోలం వేళ సరిగా స్పందించలేదన్న అపవాదును మూటగట్టుకున్నారు.
అయితే తాజాగా అంబానీ ఈ కరోనా కల్లోలంలోనూ మరో ఆస్తిని కూడబెట్టుకోవడం విశేషం. దేశం, ప్రపంచ ఆర్థిక కష్టాల్లో ఉన్న ఈ సమయంలో బ్రిటన్ కు చెందిన మరో ప్రముఖ కంపెనీని అంబానీ కొనుగోలు చేశారు.
బ్రిటన్ లో హోటల్ తోపాటు గోల్ఫ్ కోర్స్ కలిగిన స్టోక్ పార్క్ ను రిలయన్స్ సంస్థ 79 మిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేయడం విశేషం. రిలయన్స్ హాస్పిటాలిటీ ఆస్తుల్లో ఇకపై స్టోక్స్ పార్క్ కూడా భాగం కానుంది. ఇటీవలే బ్రిటన్ కు చెందిన ఆటబొమ్మల సంస్థ హామ్లిస్ ను కొన్న అంబానీ తాజాగా అదే దేశంలో మరో పెద్ద సంస్థను కొనుగోలు చేశారు. మన దేశంలోనూ వీటిని విస్తరించాలని యోచిస్తున్నారు.