Hotels Stopping Tiffin Items: ఇరాన్, అమెరికా యుద్ధ సెగలు ప్రపంచ వ్యాప్తంగా తాకుతున్నాయి. మిడిల్ ఈస్ట్‌లో ట్రంప్ పెట్టిన చిచ్చు.. క్రమంగా అన్ని దేశాలకు ఏదో ఒక రూపంలో విస్తరిస్తోంది. ఇప్పటికే ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. పాకిస్తాన్, చైనా, శ్రీలంకతోపాటు అనేక దేశాల్లో ఆయిల్ సంక్షోభం నెలకొంది. ఇక భారత్‌లో కూడా ఎల్‌పీజీ సెగ తాకింది. నగరాలు, పట్టణాల్లో ఇప్పటికే గ్యాస్, ఎల్‌పీజీ కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, హాస్టళ్లలో ఆహారం తయారీ నిలిచిపోతోంది. హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ గైడ్‌లైన్స్‌తో గ్యాస్ వాడకాన్ని తగ్గించాలని సూచించింది.
ఆహార మార్పులు
చాలా హోటళ్లలో టిఫిన్లు దొరకడం లేదు. దోసె, పూరీ, ఇడ్లీ, చపాతి వంటి ఎక్కువ గ్యాస్ తీసుకునే వంటకాలు నిలిపివేస్తున్నారు. కొన్ని కర్రీలు కూడా మానేస్తారు. అన్నం, సాధారణ ఆహారాలు మాత్రమే అందిస్తారు. పశ్చిమ ఆసియా యుద్ధం (అమెరికా, ఇళ్రాయెల్, ఇరాన్) వాణిజ్య ఎల్‌పీజీ సరఫరాను 75% తగ్గించింది. హోటళ్లు, హాస్టళ్లకు సిలిండర్లు దాదాపు లేవు. దేశవ్యాప్తంగా బెంగళూరు, చెన్నైలో కూడా ఇదే పరిస్థితి.
హైదరాబాద్‌లో ఇలా..
హైదరాబాద్‌లో 11 లక్షల ఐఖీ ఉద్యోగులు, విద్యార్థులు హాస్టళ్లలో నివసిస్తారు. సెల్ఫ్–కుకింగ్ సౌకర్యాలు కూడా ఆంక్షితం. ఆహార ధరలు పెరిగి అసౌకర్యం తప్పనిసరి. హాస్టల్స్ ఆల్టర్నేటివ్ కుకింగ్ మెథడ్స్‌ను పరీక్షించాలి. ప్రభుత్వం సరఫరా స్థిరీకరించి రెస్ట్రింక్షన్లు తొలగించాలి. దీర్ఘకాలంలో ఉV కిచెన్‌లు, సోలార్ ఆప్షన్లు అవసరం.
ఈ కొరత తాత్కాలికమైనా రోజువారీ జీవనశైలిని దెబ్బతీస్తుంది. ప్రభుత్వం గృహ ఉపయోగానికి ప్రాధాన్యత ఇచ్చినా వాణిజ్య రంగం కష్టాల్లో పడింది. ప్రత్యామ్నాయ ఇంధనాలు వాడకం పర్యావరణ లాభం కల్పిస్తుంది.