హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో సెంటిమెంట్ కోసం జల వివాదాలు తెరమీదకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో డైరెక్టర్ కేసీఆర్, హీరో జగన్ గా అభివర్ణిస్తున్నారు. కేసీఆర్ సైతం వాగ్దాటి పెంచి ఏపీ దాదాగిరి చేస్తుందంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం వెనుక కుట్ర దాగి ఉందని సమాచారం. ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా పదవి చేపట్టనున్న కౌశిక్ రెడ్డి పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో జగన్ తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కౌశిక్ తెలంగాణ ఉద్యమకారులపై రాళ్లు రువ్వినట్లు చెబుతున్నారు. అలాంటి తెలంగాణ ఉద్యమ వ్యతిరేకికి పదవి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.
నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చేందుకు జగన్ ఓదార్పు యాత్ర నిర్వహించారు. 2010 మే 28న సికింద్రాబాద్ నుంచి మహబూబాబాద్ పర్యటనకు బయలుదేరారు. తెలంగాణ ఉద్యమకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్యమకారులకు జగన్ అనుచరులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇందులో పోలీసులు కాల్పులు జరపగా కొందరు గాయపడ్డారు. అప్పుడు కాంగ్రెస్ నాయకులకు కేసులు నమోదు చేశారు.
హుజురాబాద్ ఉప ఎన్నిక తరుణంలో ప్రాజెక్టుల విషయం తెరపైకి తీసుకొచ్చి సెంటిమెంట్ ను వాడుకుని లబ్ధిపొందాలని భావిస్తున్నారు. రాజకీయంగా తమ పార్టీ అధికారం చేజిక్కించుకోవాలని టీఆర్ఎస్ పొరుగు రాష్ర్టంతో గతంలో సత్సంబంధాలున్నా ప్రస్తుతం లేనిపోని తగాదాలు సృష్టిస్తూ ఓట్లు రాబట్టుకోవాలని చూస్తున్నారు. దీంతో ఎవరికి లాభం ఉంటుందో వేచి చూడాల్సిందే.