
భారత హాకీ జట్టు ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించడంతో యావత్తు దేశం నాట్యం చేస్తోందని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నాలుగు దశాబ్దాల ఎదురుచూపులకు తెర దించుతూ జర్మనీపై భారత్ విజయం నమోదైన వెంటనే భారత జట్టు కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్ కు మోదీ ఫోన్ చేసి, అభినందించారు. టోక్యో ఒలింపిక్స్ లో గురువారం భారత్, జర్మనీ హాకీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ 5-4 తేడాతో విజయం సాధించింది. హాకీ జట్ట కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్ కు ప్రధాని ఫోన్ చేశారు. మీకు, మీ యావత్తు జట్టుకు చాలా చాలా అభినందనలు. మీరంతా చాలా గొప్ప కృష్టి చేశారు. యావత్తు దేశం నాట్యం చేస్తోంది అని మోదీ తెలిపారు.