https://oktelugu.com/

మాజీ మంత్రి ‘గంటా’ను ఆదుకునేదెవరు?

ఎలాంటి మర్యాదలైనా.. ఎలాంటి నమస్కారాలైనా.. అది అధికారంలో ఉన్నంత వరకే. ఒక్కసారి అధికారం చేజారిందా.. ఇక అంతే సంగతులు. నాటి రాచ మర్యాదలు ఏవీ దక్కవు. అయితే.. ఇప్పుడు ఏపీకి చెందిన మాజీ మంత్రి ఘంటా శ్రీనివాసరావు పరిస్థితి కూడా అదేనట. ఇప్పుడు ఆయన మాజీ. దీంతో వరుస ఇబ్బందులు వచ్చి పడుతున్నాయి శ్రీనివాసరావుకు. ఇప్పటికే రాజకీయంగా దెబ్బతిన్న ఆయనకు ఆర్థిక ఇబ్బందులు స్టార్ట్‌ అయ్యాయట. ఏకంగా ఆయన ఆస్తులను నడి రోడ్డు మీద వేలానికి పెట్టాల్సిన […]

Written By: NARESH, Updated On : November 13, 2020 9:41 am
Follow us on

Ganta Srinivasa rao

ఎలాంటి మర్యాదలైనా.. ఎలాంటి నమస్కారాలైనా.. అది అధికారంలో ఉన్నంత వరకే. ఒక్కసారి అధికారం చేజారిందా.. ఇక అంతే సంగతులు. నాటి రాచ మర్యాదలు ఏవీ దక్కవు. అయితే.. ఇప్పుడు ఏపీకి చెందిన మాజీ మంత్రి ఘంటా శ్రీనివాసరావు పరిస్థితి కూడా అదేనట. ఇప్పుడు ఆయన మాజీ. దీంతో వరుస ఇబ్బందులు వచ్చి పడుతున్నాయి శ్రీనివాసరావుకు. ఇప్పటికే రాజకీయంగా దెబ్బతిన్న ఆయనకు ఆర్థిక ఇబ్బందులు స్టార్ట్‌ అయ్యాయట. ఏకంగా ఆయన ఆస్తులను నడి రోడ్డు మీద వేలానికి పెట్టాల్సిన దుస్థితి వచ్చింది.

Also Read: ఢిల్లీలో మరణ మృదంగం.. ఏమైంది?

గంటా శ్రీనివాసరావు విశాఖలో మొదట్లో ఓ చిరుద్యోగి. ఆయన మీడియా సంస్థలోనూ పనిచేశారు. ఆ తరువాత వ్యాపార రంగంలోకి దిగారు. ప్రత్యూష పేరిట ఒక సంస్థను ప్రారంభించి తొలి అడుగులు వేశారు. ఇదంతా 30 ఏళ్ళ క్రితం మాట. ఆ తర్వాత రాజకీయ నేతలతో పరిచయాలు పెంచుకున్నారు. ఆ టైంలోనే మంత్రి అయ్యన్నపాత్రుడితో స్నేహం కుదిరింది. చివరికి రెండు దశాబ్దాల క్రితం టీడీపీ టికెట్ సంపాదించారు. ఎంపీగా అనకాపల్లి నుంచి గెలిచారు. ఆ తరువాత గంటా శ్రీనివాసరావు రాజకీయం చాలా దూకుడుగా ముందుకు సాగింది

గంటా ఎదుగుదలకు ఎంతగానో హెల్ప్‌ అయింది ప్రత్యూష సంస్థ. అంతటి అందలానికి చేర్చిన ప్రత్యూష సంస్థతో తనకు ఇప్పుడు సంబంధం లేదని గంటా చెబుతున్నా.. ఎవరూ అలా ఊహించుకోరు. అది వ్యాపారపరంగా సాంకేతిక అంశంగానే చూస్తారు. ఇక గంటా బంధువులు ఆ సంస్థలను చూసుకుంటున్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చేశాను కాబట్టి ఆ లావాదేవీలు తనకు సంబంధం లేదని ఆయన చెప్పుకున్నా అది కుదిరే పని కాదు. గంటా శ్రీనివాసరావు రాజకీయ పలుకుబడితో మరింత ఎత్తుకు ఎదిగిన ఆ సంస్థ ఇప్పుడు ఇబ్బందుల్లో ఉంటే ఆ మరకలు కూడా అంటించుకోవాల్సిందే. ఇదే ప్రత్యూష సంస్థ కోసం కాంగ్రెస్ మంత్రిగా గంటా విశాఖ గ్రంథాలయ‌ భూములను లీజు మీద తీసుకున్న సంగతిని కూడా అంతా గుర్తు చేస్తున్నారు.

Also Read: దుబ్బాకలో బీజేపీ విజయంపై తొలిసారి స్పందించిన కేసీఆర్

గంటా ఆస్తులను ఇప్పుడు ఇండియన్‌ బ్యాంక్‌ వేలానికి ప్రకటించింది. అవి విశాఖ నలుమూలలా ఉన్న భవనాలు, భూములు ఇంకా విలువైనవి. వాటిని కుదువ పెట్టి 248 కోట్ల దాకా గంటా శ్రీనివాసరావుకు చెందిన ప్రత్యూష సంస్థ రుణాలు తీసుకుంది. ఇక ఆ రుణాలకు భారీ ఎత్తున వడ్డీలు పెరిగాయి. అసలు కూడా తీర్చలేదు. దీంతో ఇప్పుడు తడిసి మోపెడయింది. ఈ ఆక్షన్ విధానంలో ఈ ఆస్తులను ఈ నెల 25న అమ్మేస్తామని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. నాలుగేళ్ళ క్రితమే డిమాండ్ నోటీసులు పంపి ఆస్తులను గుర్తించి స్వాధీనం చేసుకున్న ఇండియన్ బ్యాంక్ కి వాటిని వేలం వేయడం చిటికలో పని. ఈ ఆక్షన్ కనుక జరిగితే గంటా పరువుపోయినట్లే అవుతుంది. అది రాజకీయంగానూ మచ్చలాగే మారుతుంది.  ఈ క్రమంలో శీనన్న ఏం చేస్తాడో చూడాలి మరి.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్