https://oktelugu.com/

బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. పెరిగిన జీతాలు.. కానీ..?

దేశంలోని బ్యాంకింగ్ ఉద్యోగులకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. గత కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న వేతన పెంపు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఉద్యోగుల వేతనాలను ఏకంగా 15 శాతం పెంచింది. ఎన్నో రోజుల నుంచి వేతన పెంపు కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులు వేతన పెంపు పట్ల కీలక ప్రకటన వెలువడటంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. 15 శాతం పెంపు వల్ల ఉద్యోగుల వేతనాలు భారీగా పెరగనున్నాయి. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 13, 2020 / 08:56 AM IST
    Follow us on


    దేశంలోని బ్యాంకింగ్ ఉద్యోగులకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. గత కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న వేతన పెంపు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఉద్యోగుల వేతనాలను ఏకంగా 15 శాతం పెంచింది. ఎన్నో రోజుల నుంచి వేతన పెంపు కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులు వేతన పెంపు పట్ల కీలక ప్రకటన వెలువడటంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    15 శాతం పెంపు వల్ల ఉద్యోగుల వేతనాలు భారీగా పెరగనున్నాయి. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారితో పోలిస్తే చాలా సంవత్సరాల నుంచి పని చేస్తున్న ఉద్యోగులు కేంద్రం నిర్ణయం వల్ల ప్రయోజనం పొందనున్నారు. దాదాపు 8 లక్షల మందికి ఈ నిర్ణయం వల్ల ప్రయోజనం చేకూరనుందని తెలుస్తోంది. ఈ వేతన పెంపు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ పై దాదాపు 8,000 కోట్ల రూపాయల భారం పడనుందని సమాచారం.

    12 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 10 ప్రైవేట్ రంగ బ్యాంకులు, 7 విదేశీ బ్యాంకుల్లో పని చేసే వాళ్లకు ఈ నిర్ణయం వల్ల ప్రయోజనం చేకూరనుంది. ఉద్యోగ సంఘాలు 20 శాతం వేతన పెంపు డిమాండ్ చేయగా బ్యాంకింగ్ అసోసియేషన్ 12.25 శాతం వేతన పెంపు ప్రకటిస్తామని ప్రతిపాదన చేసింది. చివరకు 15 శాతం పెంపుకు ఆమోదం లభించింది. అయితే వేతనం పెరిగినా బ్యాంకింగ్ ఉద్యోగుల కొన్ని డిమాండ్లు మాత్రం నెరవేరలేదు.

    వారానికి అయిదు రోజుల పని, కుటుంబ పెన్షన్ తాజాపరచడం లాంటి డిమాండ్లకు మాత్రం ఆమోదం లభించలేదు. చాలా సంవత్సరాల నుంచి వారానికి అయిదు రోజుల పని ఉండేలా చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేసినా ఆ డిమాండ్ నెరవేరకపోవడం గమనార్హం.