దుబ్బాకలో బీజేపీ విజయంపై తొలిసారి స్పందించిన కేసీఆర్

దుబ్బాకలో ఓటమిపాలైన టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు జీహెచ్ఎంసీ రూపంలో కఠిన పరీక్ష సిద్దమవుతోంది.. దుబ్బాకలో గెలిచిన బీజేపీ ఇప్పుడు హైదరాబాద్ గోల్కొండపై కూడా జెండా ఎగురవేస్తామని బీరాలు పలుకుతోంది. ఈ నేపథ్యంలో ఈసారి సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగబోతున్నట్టు తెలిసింది. అందుకే ఇటీవల సినీ పెద్దలతో సమావేశమై వారికి కావాల్సిన స్టూడియోల నిర్మాణం కోసం స్థలం కేటాయించేందుకు ఓకే చెప్పారు. పలు వరాలు కురిపించారు. Also Read: ఢిల్లీలో మరణ మృదంగం.. ఏమైంది? తాజాగా హైదరాబాద్ […]

Written By: NARESH, Updated On : November 13, 2020 9:44 am
Follow us on

దుబ్బాకలో ఓటమిపాలైన టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు జీహెచ్ఎంసీ రూపంలో కఠిన పరీక్ష సిద్దమవుతోంది.. దుబ్బాకలో గెలిచిన బీజేపీ ఇప్పుడు హైదరాబాద్ గోల్కొండపై కూడా జెండా ఎగురవేస్తామని బీరాలు పలుకుతోంది. ఈ నేపథ్యంలో ఈసారి సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగబోతున్నట్టు తెలిసింది. అందుకే ఇటీవల సినీ పెద్దలతో సమావేశమై వారికి కావాల్సిన స్టూడియోల నిర్మాణం కోసం స్థలం కేటాయించేందుకు ఓకే చెప్పారు. పలు వరాలు కురిపించారు.

Also Read: ఢిల్లీలో మరణ మృదంగం.. ఏమైంది?

తాజాగా హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ముఖ్యనేతలతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు.

ఇదే సమావేశంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ కూడా పాల్గొన్నారు. గ్రేటర్ ఎన్నికలపై సుధీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. ఈ సందర్భంగా డివిజన్ల వారీగా కేసీఆర్ నివేదికలు తెప్పించుకున్నట్టు సమాచారం.

Also Read: దుబ్బాకలో బీజేపీ విజయంపై తొలిసారి స్పందించిన కేసీఆర్

ఈ సారి ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దని.. గ్రేటర్ లో 100 సీట్లు గెలవాలని. దుబ్బాక ఫలితంతో ఆందోళన చెందాల్సిన పనిలేదని కేసీఆర్ అన్నారు. దుబ్బాకలో సానుభూతి తప్ప బీజేపీ బలం కాదని.. బీజేపీ గాయి గాయి చేయాలని చూస్తుందని.. మనం ఆగం కావద్దని కేసీఆర్ నేతలకు సూచించారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

ఈ సందర్భంగా జీహెచ్ఎంసీలో సర్వేలన్నీ మనకు అనుకూలంగా ఉన్నాయని.. బీజేపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. బీజేపీతో ఇక దూకుడుగా వ్యవరించాలని కేసీఆర్ సూచించారు. డివిజన్ల వారీగా ఇన్ చార్జిలను నియమిస్తామని కేసీఆర్ తెలిపారు.