Also Read: అమరావతి కుంభకోణంలో చంద్రబాబు కుటుంబమే టార్గెటా?
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ (92), అశోక్ సింఘాల్, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి, వినయ్ కటియార్, గిరిరాజ్ కిషోర్, నాటి యూపీ సీఎం కళ్యాణ్ సింగ్ లు విచారణను ఎదుర్కొంటున్నారు. వీరే కరసేవకులను రెచ్చగొట్టి బాబ్రీ మసీదును కూల్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 29 ఏళ్లుగా కోర్టుల్లో ఈ కేసుపై విచారణ సాగుతోంది.
తాజాగా బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తుది తీర్పు వెలువడింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ వృద్ధ నేతలు అద్వానీ, జోషి, ఉమాభారతి సహా కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వారిని నిర్ధోషులుగా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కొద్దిసేపటి క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తం అవుతుండగా.. తాజాగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాత్రం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఈ కేసులో ముస్లింలకు న్యాయం జరగలేదని అసదుద్దీన్ స్పష్టం చేశారు. ఇటు సీబీఐ కోర్టు తీర్పుపై ముస్లిం లా బోర్డు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ తీర్పుపై తాము సుప్రీం కోర్టులో అప్పీల్ చేస్తామని చెప్పింది.
Also Read: కరోనాతో మరో సంచలన ప్రమాదం వెలుగులోకి..
బాబ్రీ మసీదు కూల్చివేతపై సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పుపై అసదుద్దీన్ ఓవైసీ ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ నిర్ధోషులు అయితే మసీదును ఎవరు కూల్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. బాబ్రీ మసీదు దానికి అదే కూలిపోయిందా అని ప్రశ్నించారు.