అమరావతి కుంభకోణంలో చంద్రబాబు కుటుంబమే టార్గెటా?‌

అధికారం బొమ్మ బొరుసు లాంటిది. ప్రజాదరణ ఎప్పుడు ఎవరి వైపు ఉంటుందో ఎవరం అంచనా వేయలేం. రాజకీయంలో తనకు తిరుగులేదని బీరాలు పలికే టీడీపీ అధినేత చంద్రబాబు మొన్నటి ఎన్నికల్లో డక్కామొక్కీలు తిన్నారు. ఏళ్లనాటి జగన్‌ కల ఎట్టకేలకు సాకారమైంది. అయితే.. 2019 ఎన్నికలకు ముందు విపక్షంలోని వైసీపీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబును, ఆయన ప్రభుత్వంలోని మంత్రులను టార్గెట్‌ చేస్తూ అవినీతి చక్రవర్తి పేరుతో ఓ పుస్తకాన్నే ప్రచురించారు. Also Read: విశాఖలో సచివాలయం నిర్మాణానికి […]

Written By: NARESH, Updated On : September 30, 2020 4:54 pm

amara

Follow us on


అధికారం బొమ్మ బొరుసు లాంటిది. ప్రజాదరణ ఎప్పుడు ఎవరి వైపు ఉంటుందో ఎవరం అంచనా వేయలేం. రాజకీయంలో తనకు తిరుగులేదని బీరాలు పలికే టీడీపీ అధినేత చంద్రబాబు మొన్నటి ఎన్నికల్లో డక్కామొక్కీలు తిన్నారు. ఏళ్లనాటి జగన్‌ కల ఎట్టకేలకు సాకారమైంది. అయితే.. 2019 ఎన్నికలకు ముందు విపక్షంలోని వైసీపీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబును, ఆయన ప్రభుత్వంలోని మంత్రులను టార్గెట్‌ చేస్తూ అవినీతి చక్రవర్తి పేరుతో ఓ పుస్తకాన్నే ప్రచురించారు.

Also Read: విశాఖలో సచివాలయం నిర్మాణానికి ముహూర్తం ఫిక్స్‌..?

చంద్రబాబు అధికారంలో ఉండగా చేసిన కుంభకోణాలను అందులో పేర్కొన్నారు. వాటి విలువ రూ.6 లక్షల కోట్లు ఉంటుందంటూ చెప్పుకొచ్చారు. ఇందులో ముఖ్యంగా అమరావతి భూసేకరణను కూడా ఎక్కించారు. ఈ వ్యవహారంలో అప్పటి సీఎం చంద్రబాబుతోపాటు ఆయన కేబినెట్‌ మంత్రులు, టీడీపీ సీనియర్‌ నేతలను చేర్చారు. తాము అధికారంలోకి వస్తే అమరావతి భూసేకరణలో చోటు చేసుకున్న స్కాంపై దర్యాప్తు జరిపించి దోషులను శిక్షిస్తామని చెప్పారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతోంది. కానీ.. ఇంతవరకూ అమరావతి భూముల స్కాం వెలికితీసింది లేదు. ఎవరినీ శిక్షించనూ లేదు. మరోవైపు ఈ వ్యవహారంలో చంద్రబాబును, ఆయన కొడుకు లోకేష్‌ను మాత్రమే టార్గెట్ చేసే వైసీపీ.. మిగతా టీడీపీ సీనియర్లను ఎందుకు వదిలేసిందనేది ఇప్పుడు చర్చకు దారితీసింది.

టీడీపీ ప్రభుత్వం హయాంలో ఎన్నో అవినీతి అక్రమాలు జరిగాయని.. అమరావతి భూసేకరణలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని ఎన్నికలకు ముందు ప్రచారంలోనూ జగన్, ఆయన టీం విమర్శలు చేశాయి. చంద్రబాబు సీఎంగా, మంత్రిగా ఆయన తనయుడు లోకేష్‌తోపాటు ఇతరులు, టీడీపీ సీనియర్ నేతలను టార్గెట్‌ చేసేది. ఇదే క్రమంలో అప్పటి మున్సిపల్‌ మంత్రి నారాయణ, టీడీపీ సీనియర్లు పయ్యావుల కేశవ్‌, ధూళిపాళ్ల నరేంద్రతోపాటు మరికొందరి పేర్లను వారు కొనుగోలు చేసిన భూముల ఆధారంగా బయటపెట్టింది. ఈ జాబితాలో ముందుగా మంత్రి నారాయణ అత్యధికంగా 3,000 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్లు వైసీపీ ఆరోపించింది. ఆ తర్వాత పయ్యావుల ఆయన కుమారుడి పేరుతో రాజధానిలో భూములు కొన్నారని ఆరోపించేది. ధూళిపాళ నరేంద్రతో పాటు ఇతర నేతలను ఇందులోకి లాగింది.

Also Read: లాక్డౌన్ నష్టాలను పూడ్చుకుంటున్న రామోజీరావు?

అప్పుడు ఆ స్థాయిలో ధ్వజమెత్తిన వైసీపీ నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్‌ అయ్యారో అర్థం కాకుండా పోయింది. చంద్రబాబు కుటుంబం పాత్ర ఉన్న అమరావతి స్కాంపై సీబీఐ దర్యాప్తు చేయించాలని కేంద్రాన్ని వైసీపీ కోరుతోంది. కానీ.. అమరావతిపై దర్యాప్తు మొదలైతే అన్ని పేర్లు వస్తాయని అనుకున్నా.. చంద్రబాబు కుటుంబం మినహా మిగిలిన వారి పేర్లను కనీసం ప్రస్తావించేందుకు కూడా వైసీపీ ఇష్టపడటం లేదట. కనీసం ప్రెస్‌మీట్లలో సైతం వైసీపీ నేతలు చంద్రబాబును మాత్రమే టార్గెట్‌ చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం సెలక్టెడ్‌ టార్గెట్‌గా మారుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో అమరావతి భూముల స్కాంలో ఎవరి పాత్ర ఉందని వైసీపీ ఆరోపించిందో, ఎవరెవరు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని పుస్తకాలు అచ్చేసిందో ఇప్పుడు వారి పేర్లు కనీసం ఏసీబీ, సీఐడీ దర్యాప్తుల్లోనూ కనిపించడం లేదు. దీంతో వీరి విషయంలో వైసీపీ అభిప్రాయం ఎందుకు మార్చుకుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.