https://oktelugu.com/

పవన్ తో బండ్ల గణేష్ సినిమా.. ఓ హాట్ టాపిక్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక ఫుల్ బీజీగా మారిపోయాడు. వరుసగా నాలుగైదు సినిమాలను అనౌన్స్ చేశాడు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగులు ఆలస్యం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాత బండ్ల గణేష్ పవన్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. Also Read: డ్రైవర్ ను ‘ముమైత్ ఖాన్’ మోసం చేయడం వెనుక..? పవన్ కల్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ మూవీలో నటిస్తున్నాడు. బాలీవుడ్లో సూపర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 30, 2020 / 03:31 PM IST

    pawankal

    Follow us on

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక ఫుల్ బీజీగా మారిపోయాడు. వరుసగా నాలుగైదు సినిమాలను అనౌన్స్ చేశాడు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగులు ఆలస్యం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాత బండ్ల గణేష్ పవన్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

    Also Read: డ్రైవర్ ను ‘ముమైత్ ఖాన్’ మోసం చేయడం వెనుక..?

    పవన్ కల్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ మూవీలో నటిస్తున్నాడు. బాలీవుడ్లో సూపర్ హిట్టుగా నిలిచిన ‘పింక్’ మూవీని తెలుగులో నిర్మాత దిల్ రాజు, శ్రీదేవి భర్త బోనికపూర్ నిర్మిస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ తో ఈ మూవీ షూటింగు నిలిచిపోయింది. ‘వకీల్ సాబ్’ మూవీ షూటింగ్ హైదరాబాద్లో ప్రారంభించినట్లు తెలుస్తోంది. త్వరలోనే పవన్ కల్యాణ్ సైతం ఈ షూటింగులో పాల్గొనేందుకు రెడీ అవుతున్నాడు.

    ఇక సినిమా తర్వాత వరుసగా పవన్ మూడు సినిమాలకు చేయబోతున్నారు. క్రిష్ దర్శకత్వంలో ‘విరూపాక్షి’ సినిమాతోపాటు డైరెక్టర్ హరీష్ శంకర్ తో #PSPK 28 మూవీ చేయబోతున్నాడు. అదేవిధంగా దర్శకుడు సురేందర్ రెడ్డితో ఓ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీని తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ తో ఓ మూవీ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.

    Also Read: వెంకీ ఆఫర్.. శర్వానంద్ చేతుల్లోకి?

    ఇలా నాలుగైదు సినిమాలు పవన్ చేతిలో ఉన్నారు. ఈ తరుణంలో నిర్మాత బండ్ల గణేష్ త్వరలో పవన్ కల్యాణ్ తో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించడం ఆసక్తిని రేపుతోంది. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ వచ్చింది. దీంతో వీరి కాంబినేషన్ పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే పవన్ ప్రస్తుతం కమిటైన సినిమాలు పూర్తి చేశాకగానీ నెక్ట్ ప్రాజెక్టు చేయడానికి వీల్లేదు. దీంతో ఇప్పట్లో వీరి కాంబినేషన్లో సినిమా రావడం కష్టమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే పవన్ సినిమాపై ఇప్పటి నుంచి బండ్ల గణేష్ కలలు కంటుండటం గమనార్హం.