
తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. సీఎం జగన్ ప్రమాణ స్వీకారం రోజున కేసీఆర్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్ తన దత్తపుత్రుడు అంటూ తన ప్రేమను చాటుకున్నాడు. రాజకీయంగానే కాకుండా కుటుంబపరంగా జగన్ తో కేసీఆర్ సన్నిహిత సంబంధాలను నేర్పుతున్నాడు.
కిందటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచేందుకు కేసీఆర్ తనవంతు సహకారం అందించారు. చంద్రబాబు నాయుడు గెలుస్తాడని విశ్లేషకులు చెప్పినా.. కేసీఆర్ మాత్రం జగనే గెలుస్తాడని ముందే జోస్యం చెప్పారు. జగన్ సీఎం అయ్యాక ఏపీ, తెలంగాణ మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి పెరిగిపోయింది. అయితే ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు చేస్తుంటే వీరి మైత్రికి బీటలు పడుతున్నట్లు కన్పిస్తోంది.
కరోనాను కట్టడి చేయడంలో జగన్ విజయం సాధించగా కేసీఆర్ మాత్రం విఫలయ్యారు. జగన్ ఏపీలో అనేక సంక్షేమ పథకాలతో దూసుకెళుతుండటం కూడా కేసీఆర్ కు తలనొప్పిగా మారింది. అదేవిధంగా రాయలసీమలో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో గతంలో రాజకీయంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకున్న ఈ నేతలు కొంతకాలంగా సమస్యలను కావాలనే పెద్దవి చేస్తున్నారనే టాక్ విన్పిస్తోంది.
తాజాగా సీఎం కేసీఆర్ తెలంగాణకు రావాల్సిన నీటి కోసం.. దేవునితోనైనా కొట్లాటకు సిద్ధమంటూ ప్రకటించాడు. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ఏపీ సర్కార్ కెలికి కయ్యం పెట్టుకుంటోందని విమర్శించారు. అయితే కేసీఆర్ మాటలను జగన్ పెద్దగా పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కేసీఆర్ తనదైన శైలిలో జగన్ పై స్పందించకపోవడంతో వీరివురు తెలంగాణ-ఏపీ సమస్యలను రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
జగన్-కేసీఆర్ వ్యవహర శైలి చూస్తుంటే పైకి కొట్లాటలా ఉన్నా.. లోపల మాత్రం స్నేహం బంధం కొనసాగిస్తున్నారనే టాక్ విన్పిస్తోంది. నిజంగా కేసీఆర్ కు నీటి సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధి ఉంటే దేవుడితో కొట్లాట సంగతి పక్కనపెట్టి.. పక్కనే ఉంటే జగన్ తో కొట్లాడాలంటూ పలువురు సైటర్లు వేస్తున్నారు.
Comments are closed.