ఏపీలో బీజేపీకి సపోర్టు మీడియా ఏదీ..?

బీజేపీ ఎప్పుడూ ఎక్కువగా సోషల్‌ మీడియా మీదనే ఆధారపడుతూ ఉంటుంది. మీడియాపై పెద్దగా ఫోకస్‌ పెట్టినా కొన్ని మీడియా సంస్థలైతే సపోర్టుగా నిలుస్తుంటాయి. అటు పక్క రాష్ట్రమైన తెలంగాణలోనూ బీజేపీకి ఓ మీడియా సపోర్టుగా నిలుస్తూ వస్తోంది. కానీ.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అలాంటి పరిస్థితి లేకుండా పోయింది. గతంలో ఏదో ఓ మీడియా కవరేజీ ఇవచ్చేది. ఇప్పుడు ఏ మీడియాలోనూ వారు కనిపించడం లేదు. గతంలో ఆంధ్రజ్యోతినే ఎంతో కొంత కవరేజీ ఇచ్చేది. ఇప్పుడు ఆ ఛాన్స్ […]

Written By: Srinivas, Updated On : March 20, 2021 3:01 pm
Follow us on


బీజేపీ ఎప్పుడూ ఎక్కువగా సోషల్‌ మీడియా మీదనే ఆధారపడుతూ ఉంటుంది. మీడియాపై పెద్దగా ఫోకస్‌ పెట్టినా కొన్ని మీడియా సంస్థలైతే సపోర్టుగా నిలుస్తుంటాయి. అటు పక్క రాష్ట్రమైన తెలంగాణలోనూ బీజేపీకి ఓ మీడియా సపోర్టుగా నిలుస్తూ వస్తోంది. కానీ.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అలాంటి పరిస్థితి లేకుండా పోయింది. గతంలో ఏదో ఓ మీడియా కవరేజీ ఇవచ్చేది. ఇప్పుడు ఏ మీడియాలోనూ వారు కనిపించడం లేదు.

గతంలో ఆంధ్రజ్యోతినే ఎంతో కొంత కవరేజీ ఇచ్చేది. ఇప్పుడు ఆ ఛాన్స్ లేకుండా పోయింది. వారే స్వయంగా ఆంధ్రజ్యోతిని బ్యాన్ చేయడంతో ఇప్పుడు ఎవరికీ పట్టడం లేదు. తిరుపతి ఉపఎన్నికల నేపథ్యంలో సోము వీర్రాజు నేతృత్వంలోని పార్టీ ఏం చేస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఏ మీడియాలోనూ వారి హడావుడి కనిపించడం లేదు. గతంలో అలా ఉండేది కాదు. ఇప్పుడు.. ఎన్నికల షెడ్యూల్ వచ్చినా అసలు బీజేపీ ఎలాంటి కసరత్తు చేస్తుందో కూడా పట్టించుకునే తీరిక లేదు. జనసేన పార్టీ సీటును త్యాగం చేసేసింది.

మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లో మీడియా భిన్నం. పార్టీల వారీగా చీలిపోయింది. ఏ పార్టీకి సపోర్ట్ లేకుండా.. ఒక్క న్యూస్ మాత్రమే రిపోర్ట్ చేస్తూ ఈటీవీ ఒక్కటే కాస్త తటస్థంగా కనిపిస్తూ ఉంటుంది. మిగతా చానళ్లలో బీజేపీకి కవరేజీ కావాలంటే ఆయా పార్టీలకు అనుకూలమైన ప్రకటనలు లేదా.. తమకు దగ్గరగా ఉన్న పార్టీకి వ్యతిరేక పార్టీపై విమర్శలు చేయాలి. అలా అయితేనే కవరేజీ వస్తుంది. అలా చేయడం వల్ల.. ఆ పార్టీలకు మాత్రమే లాభం. కానీ.. బీజేపీకి ఎలాంటి ఉపయోగం ఉండటం లేదు. ఇప్పుడు బీజేపీ ఉపఎన్నికల బరిలో దిగింది. ఇప్పుడు ఆ పార్టీకి కావాల్సింది మీడియా అండ. బీజేపీకి అంతో ఇంతో సపోర్ట్‌గా నిలిచే ఆంధ్రజ్యోతి కవరేజీ లేకపోవడంతో.. ఆ పార్టీ తీవ్రంగా నష్టపోతోంది.

ఇదిలా ఉండగా. తిరుపతి ఉపఎన్నికల్లో ప్రచారం కోసం ఇప్పుడు బీజేపీ వెంపర్లాడాల్సిందే. ఎందుకంటే.. వైసీపీ అనుకూల మీడియాలో ఇక బీజేపీకి చోటు దక్కదు. ఆ పార్టీ భారీ మెజార్టీపై కన్నేసింది. ఏమైనా ఢిల్లీ స్థాయిలో అండర్ స్టాండింగ్ పెట్టుకుని కవరేజీ ఇవ్వాలన్న రూల్ ఉంటే తప్ప కవరేజీ రాదు. ఇక టీడీపీ అనుకూల మీడియాను ఓ రకంగా బీజీపేనే దూరం పెట్టింది. ఇక సోషల్ మీడియాలోనూ ఆ పార్టీ అంత చురుకుగా లేదు. దీంతో ఇప్పుడు బీజేపీకి కవరేజీ ఇచ్చే మీడియా కనిపించడమే లేదు.