https://oktelugu.com/

జనసేన-బీజేపీ పొత్తు.. ఏకాభిప్రాయం అవసరం!

2014 ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కలిసి పోటీచేసి అధికారంలోకి వచ్చాయి. అయితే ఐదేళ్లలోనే ఆ పొత్తు వికటించి ఎవరీదారి వారు చూసుకున్నారు. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు ఒంటరిగా పోటీచేయగా జనసేన కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పోటీ చేసింది. అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం వీయడంతో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. ఇక టీడీపీకి కేవలం 23 సీట్లురాగా జనసేనకు ఒకే ఒక్క సీటు వచ్చింది. జాతీయ పార్టీలైన బీజేపీ, […]

Written By: , Updated On : September 1, 2020 / 04:19 PM IST
Follow us on

2014 ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కలిసి పోటీచేసి అధికారంలోకి వచ్చాయి. అయితే ఐదేళ్లలోనే ఆ పొత్తు వికటించి ఎవరీదారి వారు చూసుకున్నారు. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు ఒంటరిగా పోటీచేయగా జనసేన కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పోటీ చేసింది. అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం వీయడంతో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. ఇక టీడీపీకి కేవలం 23 సీట్లురాగా జనసేనకు ఒకే ఒక్క సీటు వచ్చింది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు ఒక్క సీటు కూడా రాకపోవడం గమనార్హం.

ఇక విచిత్రం ఏమిటంటే ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన-బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. 2024 ఎన్నికలే లక్ష్యంగా ఈ పొత్తు పొడిచినట్లు తెలుస్తోంది. ఏపీలో ఒక్క సీటు లేని బీజేపీతో ఒక్క సీటు ఉన్న జనసేన పార్టీ 2024లో అధికారంలోకి రావాలని ఇప్పటి నుంచి కలలు కంటున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు పొడిచనప్పటికీ ప్రజా సమస్యల విషయంలో వేర్వురు ప్రకటనలు చేస్తున్నారు. ప్రధానంగా ఏపీకి అతి ముఖ్యమైన రాజధాని విషయంలో బీజేపీ, జనసేన పార్టీలో విభిన్న వాదనలు విన్పిస్తున్నాయి. దీంతో ఈ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల వరకు కలిసి ఉంటాయా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీకి ఒకటే రాజధాని ఉండాలని.. అది అమరావతేననే స్పష్టం చేస్తున్నారు. అమరావతి ప్రజల పక్షాన పోరాడుతానంటూ చెబుతున్నారు. అమరావతి రాజధాని జనసేన కట్టుబడి ఉందని ఎన్నోసార్లు స్పష్టం చేశాడు. అయితే బీజేపీ మాత్రం మూడు రాజధానులే కాదు.. జిల్లాకో రాజధాని పెట్టుకున్న తామకేమీ అభ్యంతరం లేదని చెబుతోంది. దీంతో ఈ రెండు పార్టీలు కేవలం ఓట్లు, రాజకీయ కోసమే పొత్తు పెట్టుకున్నాయా? లేక ప్రజా సమస్యలను పరిష్కరించుకుందుకు పొత్తు పెట్టుకున్నాయా? అనే ప్రశ్నలు తలెత్తున్నారు.

జనసేన-బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నప్పుడు ఒకే అభిప్రాయంతో ప్రజల ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అలా కాకుండా ఎవరూ వారు సొంత ఏజెండాతో ముందుకెళితే ప్రజలు ఎవరినీ నమ్మి ఓట్లు వేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇరుపార్టీలు వేర్వేరు అభిప్రాయాలతో ప్రజలు ముందుకెళితే ప్రజల నుంచి విమర్శలు రావడం ఖాయంగా కన్పిస్తోంది. అయినప్పటికీ ఇరుపార్టీలు వేర్వురు ప్రకటనలు చేయడం ప్రజలను మోసగించడం కోసమేనా? అన్న వాదనలు ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్నారు.

మరికొందరు మాత్రం ఈ రెండు పార్టీల పొత్తు 2024 వరకు కొనసాగే అవకాశం లేదని తేల్చి చెబుతున్నారు. అందువల్లే ఈ రెండు పార్టీలు విభిన్న అభిప్రాయాలతో ప్రజల ముందుకెళుతున్నాయని ఆరోపణలు చేస్తున్నారు. ఇక 2024 ఎన్నికలే టార్గెట్ పెట్టుకొని ముందుకెళుతున్న బీజేపీ-జనసేన కూటమి పొత్తు విషయంలో మరోసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కలిసి నడువాలని అని అనుకున్నప్పుడు ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకుంటూనే మంచి ఫలితాలు వస్తాయని లేనట్లయితే ప్రజల చేతిలో ఓటమి చవిచూడాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.