వ్యాక్సినేషన్ లక్ష్యం ఎప్పటికి చేరేనో?

కరోనా మహమ్మారి సృష్టించిన ప్రళయం అందరికి తెలిసిందే. ప్రపంచమంతా కుదేలయిపోతోంది. వైరస్ బారి నుంచి రక్షించుకోవడానికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరికి వ్యాక్సిన్ అందే విషయంలో ఆలస్యం అవుతోంది. ఇప్పటి వరకు కేవలం 5 శాతం మందికి మాత్రమే వ్యాక్సినేషన్ వేయటం జరిగింది. దీంతో అందరికి వ్యాక్సినేషన్ అందేందుకు ఇంకా చాలా సమయం పడుతోందని నిపుణులు చెబుతున్నారు. 18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్ వేయాలంటే ఏడాది చివరాఖరుకు మాత్రమే సాధ్యమవుతుందని ఓ […]

Written By: Srinivas, Updated On : June 20, 2021 7:37 pm
Follow us on

కరోనా మహమ్మారి సృష్టించిన ప్రళయం అందరికి తెలిసిందే. ప్రపంచమంతా కుదేలయిపోతోంది. వైరస్ బారి నుంచి రక్షించుకోవడానికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరికి వ్యాక్సిన్ అందే విషయంలో ఆలస్యం అవుతోంది. ఇప్పటి వరకు కేవలం 5 శాతం మందికి మాత్రమే వ్యాక్సినేషన్ వేయటం జరిగింది. దీంతో అందరికి వ్యాక్సినేషన్ అందేందుకు ఇంకా చాలా సమయం పడుతోందని నిపుణులు చెబుతున్నారు.

18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్ వేయాలంటే ఏడాది చివరాఖరుకు మాత్రమే సాధ్యమవుతుందని ఓ అంచనా. వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలై ఐదు నెలలు గడిచినా కేవలం ఐదు శాతం మందికి మాత్రమే టీకా వేయడం జరిగింది. దీంతో మిగతా మందికి వ్యాక్సినేషన్ పూర్తి కావాలంటే ఇంకా చాలా సమయం పడుతుందని చెబుతున్నారు. మిగిలిన ఆరు నెలల్లో 95 శాతం మందికి వ్యాక్సినేషన్ వేయటం అసాధ్యమనే చెప్పాలి.

ఒక డోసు వేసుకున్న వారి సంఖ్య క్రమేణా పెరుగుతోంది. ఇప్పటి వరకు దేశ జనాభాలో 27 కోట్ల మందికి మాత్రమే ఒక డోసు వ్యాక్సిన్ ఇచ్చారు. గత వారంలో రోజుకు 30 లక్షలకు పైగా డోసుల వ్యాక్సినేషన్ జరిగినట్లు అంచనా. నిన్న 38 లక్షలకు పైగా డోసుల వ్యాక్సిన్ వేశారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి దేశంలోని 95 కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేయాలంటే ఈ లెక్కలు చాలా పెరగాలని స్పష్టం అవుతోంది.

రోజుకు కనీసం 83 లక్షల డోసులు పెరగాల్సి ఉంది. అనుకున్న లక్షం చేరుకోవాలంటే వ్యాక్సిన్లు అందుబాటులోకి రావాల్సి ఉంటుంది. ఇప్పటికే 20 రోజులు గడిచిపోయాయి. ఈనెలలో వేసిన వ్యాక్సిన్ల సంఖ్య ఐదు కోట్లు మాత్రమే. ప్రభుత్వ టార్గెట్ చేరుకోవాలంటే వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగవంతం కావాల్సిన అవసరాన్నిగుర్తించాలి.