https://oktelugu.com/

ఎఫైర్లు లేవు అంటున్న అప్పటి స్టార్ హీరోయిన్ !

‘మీనాక్షి శేషాద్రి’ గురించి ఇప్పటి కుర్రకారుకు పెద్దగా తెలియక పోవచ్చు. ఆమె ఒక సంచలనం, ఆమె ఒక తరానికి స్వప్న సుందరి. ఆమె అందానికి ఆ తరం వారు మైమరచిపోయారు. ఆమె అభినయానికి అప్పటి ప్రేక్షక లోకం దాసోహం అంది. ఇది మీనాక్షి శేషాద్రి ట్రాక్ రికార్డు. అయితే, ఆమె అభిమానులకు ఒక శుభవార్త. పెళ్ళైన 26 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆమె నటించేందుకు రెడీ అంటున్నారు. మీనాక్షి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలు చెప్పుకొచ్చారు. […]

Written By:
  • admin
  • , Updated On : June 20, 2021 / 06:05 PM IST
    Follow us on

    ‘మీనాక్షి శేషాద్రి’ గురించి ఇప్పటి కుర్రకారుకు పెద్దగా తెలియక పోవచ్చు. ఆమె ఒక సంచలనం, ఆమె ఒక తరానికి స్వప్న సుందరి. ఆమె అందానికి ఆ తరం వారు మైమరచిపోయారు. ఆమె అభినయానికి అప్పటి ప్రేక్షక లోకం దాసోహం అంది. ఇది మీనాక్షి శేషాద్రి ట్రాక్ రికార్డు. అయితే, ఆమె అభిమానులకు ఒక శుభవార్త. పెళ్ళైన 26 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆమె నటించేందుకు రెడీ అంటున్నారు.

    మీనాక్షి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలు చెప్పుకొచ్చారు. ఇక అప్పట్లో తనకు ఎవరూ బాయ్ ఫ్రెండ్స్ లేరని చెప్పడమే అందరిని షాక్ కి గురి చేసింది. నిజానికి మీనాక్షి ప్రేమలో మునిగి కెరీర్ నే పోగొట్టుకున్న హీరోలు ఉన్నారు. మరి అలాంటప్పుడు మీనాక్షి ఇంత సింపుల్ గా ఈ స్టేట్ మెంట్ ఎలా ఇచ్చి ఉంటారు ? మీనాక్షి మాటల్లోనే ‘అప్పట్లో నన్ను అందరూ ఐస్ మైడెన్ అంటే ఆడ ప్రవరాఖ్య లేండి. అంటూ ఏడిపించే వారు.

    ఇక నేను కూడా ఎవరి మాటలకు రియాక్ట్ అయ్యేదాన్ని కాదు. పైగా అప్పట్లో నేను ఒంటరిగానే ఉండేదాన్ని. ఎందుకంటే అప్పట్లో నాకు బాయ్ ఫ్రెండ్స్ లేరు, అలాగే ఎలాంటి ఎఫైర్లు కూడా లేవు’ అంటూ సిగ్గు పడుతూ చెప్పుకొచ్చింది ఈ ముదురు భామ. ఏది ఏమైనా పాత తరం హీరోయిన్లు అందరూ తమ పాత ప్రణయ సంబంధాల గురించి కొత్త కుర్రాళ్లకు తెలియదు అనుకోవడం పొరపాటే.

    అయినా, ఇప్పటి తరం వాళ్ళకి తెలియదనుకున్నా.. అప్పటి తరం వారు ప్రత్యేకంగా చెబుతారు కదా. ఇక మీనాక్షి శేషాద్రి ప్రస్తుతం అమెరికాలోని డల్లాస్ లో స్థిరపడ్డారు. ఆమెకిద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లి చేసుకున్న తరువాత సినిమాలకు ఆమె దూరం అయ్యారు. మధ్యలో కొన్నాళ్ళు పాటు ఇండియాలో ఉన్నా.. దాదాపు ఇరవై ఏళ్ల నుండి అమెరికాలోనే ఎక్కువుగా ఉంటున్నారు.