
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్ లను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. భవిష్యత్‌లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదని ప్లాన్ చేసేవాళ్లకు మోదీ సర్కార్ శుభవార్త చెప్పింది. ప్రతి నెలా డబ్బులు పొందాలని భావించే వాళ్ల కోసం అదిరిపోయే స్కీమ్ ను అమలు చేస్తోంది. ఈ స్కీమ్‌లో చేరడం వల్ల ప్రతి నెలా డబ్బులు సులభంగా పొందవచ్చు.
ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన పేరుతో కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. అసంఘటిత రంగంలోని వారు ఈ స్కీమ్‌లో చేరే అవకాశం ఉంటుంది. నెల ఆదాయం 15,000 రూపాయల లోపు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ లో చేరడానికి అర్హులు. ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు నెలకు 3,000 రూపాయల చొప్పున 36,000 రూపాయలు సంవత్సరానికి పొందే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.
అయితే ఈ స్కీమ్ లో 60 ఏళ్లు దాటిన తర్వాతనే ఇలా నెలనెలా డబ్బులు వస్తాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. దగ్గరిలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఈ పథకంలో సులభంగా చేరవచ్చు. బ్యాంక్ అకౌంట్, ఆధార్ ఉంటే ఈ స్కీమ్ లో చేరవచ్చు. ఈ పథకంలో చేరిన వారు నెలనెలా కొంత మొత్తాన్ని వయస్సును బట్టి చెల్లించాలి. రూ.55 నుంచి రూ.200 వరకు స్కీమ్ లో చేరిన వాళ్లు చెల్లించాల్సి ఉంటుంది.
వయస్సు ప్రాతిపదికన చెల్లించే మొత్తంలో మార్పులు ఉంటాయి. ఈ స్కీమ్ లో చేరిన వాళ్లకు నెలకు 3,000 రూపాయల చొప్పున లభిస్తాయి. ఇప్పటివరకు ఈ స్కీమ్ లో చేరని వాళ్లు వెంటనే ఈ స్కీమ్ లో చేరితే మంచిది.