WhatsApp : ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడుతూనే ఉంటారు. అయితే వాట్సాప్ మే 5 నుండి అనేక స్మార్ట్‌ఫోన్‌లలో పనిచేయడం ఆగిపోతుంది. వాట్సాప్ ప్రతేడాది చాలా పాతవి, కంపెనీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను ఆపేసిన ఫోన్‌ల జాబితాను విడుదల చేస్తుంది. వాట్సాప్ iOS 15.1 వెర్షన్ లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్‌లో మాత్రమే పనిచేస్తుంది. అంటే iPhone 5s, iPhone 6, iPhone 6 Plus ఉన్నవారి ఫోన్‌లలో వాట్సాప్ పనిచేయదు.
మెటా వాట్సాప్ సపోర్ట్‌ను ఎందుకు నిలిపివేస్తోంది?
వాట్సాప్ వినియోగదారుల సౌలభ్యం కోసం, వారి ప్రైవసీని బలోపేతం చేసేందుకు నిరంతరం పనిచేస్తుంది. అందువల్ల ప్రతి సంవత్సరం సేఫ్ కాని, అప్ డేట్ ఫీచర్లు పనిచేయని పాత పరికరాల జాబితాను రిలీజ్ చేస్తుంది. కంపెనీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను ఆపేసిన ఐఫోన్ మోడళ్లలో డేటా చోరీ లేదా వైరస్ ప్రమాదం పెరుగుతుంది. ఇందులో వాట్సాప్ బిజినెస్ యాప్ కూడా ఉంటుంది.
Also Read : వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇది మీకు ఉపయోగమేనా తెలుసుకోండి..
ఈ ఐఫోన్ మోడళ్లలో వాట్సాప్ పనిచేస్తుంది
వాట్సాప్ తన సపోర్టును అన్ని పాత మోడళ్ల నుంచి తొలగించడం లేదు. ఇప్పటికీ iPhone 8, iPhone X వాట్సాప్ సపోర్టు లభిస్తూనే ఉన్నాయి. కానీ ఈ మోడళ్లకు కూడా కంపెనీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను అందించడం లేదన్న విషయం గుర్తుంచుకోవాలి. దీని ప్రకారం, రాబోయే సంవత్సరాల్లో ఈ పరికరాల్లో కూడా వాట్సాప్ సపోర్ట్ ఆగిపోనుంది.
తప్పించుకోవాలంటే ఇలా చేయండి
ప్రతిరోజూ వాట్సాప్‌ను ఉపయోగిస్తుంటే కొత్త సాఫ్ట్‌వేర్ పనిచేసే స్మార్ట్‌ఫోన్‌ను కొనడానికి ప్రయత్నించాలి. సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కొనుగోలు చేస్తుంటే సాఫ్ట్‌వేర్‌పై దృష్టి పెట్టాలి. కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లతో ఫోన్లు తీసుకోవడం వల్ల వాట్సాప్ లేటెస్ట్ ఫీచర్లైన చాట్ లాక్, డిసప్పియరింగ్ మెసేజ్ ఫీచర్, ప్రైవసీ సెట్టింగ్‌ల ప్రయోజనం కూడా లభిస్తుంది.
Also Read : అమ్మకానికి ఇన్‌స్టాగ్రామ్-వాట్సాప్? ఇంతకీ ఏం జరిగింది.