Dual CNG Cylinder Cars : సీఎన్జీ కార్లకు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. కానీ సీఎన్జీ కారు కొనాలనుకునే కస్టమర్లు సిలిండర్ కారణంగా బూట్ స్పేస్ ఉండదనే సమస్యతో బాధపడుతున్నారు. మీరు కూడా కొత్త సీఎన్జీ కారు కొనాలని ఆలోచిస్తున్నట్లు అయితే.. సీఎన్జీ కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే 2 సీఎన్జీ సిలిండర్లు ఉన్నప్పటికీ కంప్లీట్ బూట్ స్పేస్‌ను అందించే కొన్ని కార్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
Tata Tiago CNG : టాటా మోటార్స్ ఈ కారులో రెండు సీఎన్జీ సిలిండర్లు ఉన్నాయి. ఈ హ్యాచ్‌బ్యాక్ ధర రూ.5,99,990 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. సీఎన్జీ టాప్ మోడల్ ధర రూ.8,74,990 (ఎక్స్-షోరూమ్). ఈ కారు ఒక కిలోగ్రామ్‌కు 26.49కిమీ వరకు మైలేజ్‌ను అందిస్తుంది.
Hyundai Grand i10 Nios CNG : హ్యుందాయ్ ఈ డ్యూయల్ సీఎన్జీ కారు ధర రూ.7,83,500 (ఎక్స్-షోరూమ్) నుండి రూ.8,38,200 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. కార్‌దేఖో ప్రకారం.. ఈ కారు కిలోకు 27కిమీ మైలేజ్‌ను అందిస్తుంది.
Also Read : బడ్జెట్ ఫ్రెండ్లీ సీఎన్జీ కార్స్.. మైలేజ్‌తో పాటు డిక్కీ స్పేస్‌లోనూ సూపర్!
Hyundai Aura CNG : హ్యుందాయ్ కంపెనీ ఈ కారు రెండు సిలిండర్ల సీఎన్జీ మోడల్ ధర రూ.8,37,000 (ఎక్స్-షోరూమ్) నుండి రూ.9,11,000 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. కార్‌దేఖో ప్రకారం, ఒక కిలో సీఎన్జీతో ఈ కారు 28 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.
Tata Altroz CNG : డ్యూయల్ సిలిండర్‌తో వచ్చే ఈ సీఎన్జీ కారు ధర రూ.7,59,990 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. కార్‌దేఖో నివేదిక ప్రకారం, ఈ కారు కిలోకు 26.2కిమీ వరకు మైలేజ్‌ను ఇస్తుంది.
Tata Tigor CNG : టాటా టిగోల్ డ్యూయల్ సిలిండర్‌తో వచ్చే ఈ సీఎన్జీ కారును కొనాలనుకుంటే రూ.7,69,990 నుండి రూ.9,44,990 (ఎక్స్-షోరూమ్) వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కార్‌దేఖో ప్రకారం, ఈ కారు వినియోగదారులకు 26.49 కిలోమీటర్ల వరకు మైలేజ్‌ను అందిస్తుంది.
Hyundai Exter CNG : హ్యుందాయ్ ఈ చౌకైన ఎస్ యూవీ సీఎన్జీ వేరియంట్ ధర రూ.8,64,300 (ఎక్స్-షోరూమ్) నుండి రూ.9,24,900 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. కార్‌వాలే నివేదిక ప్రకారం.. ఈ కారు 27.1 కిలోమీటర్ల వరకు మైలేజ్‌ను అందిస్తుంది.
Also Read : CNG కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే బెస్ట్ మోడల్స్ ఇవే..