Homeజాతీయ వార్తలుVijay WhatsApp letter controversy: పొత్తు కుదురుతున్న వేళ వాట్సాప్ లో లెటర్.. TVK విజయ్...

Vijay WhatsApp letter controversy: పొత్తు కుదురుతున్న వేళ వాట్సాప్ లో లెటర్.. TVK విజయ్ కి ఎవరైనా రాజకీయాలు నేర్పండయ్యా..

Vijay WhatsApp letter controversy: రాజకీయాలు చేసేవారు లౌక్యాన్ని ప్రదర్శించాలి. అధికారాన్ని దక్కించుకోవాలి అనుకునేవారు గౌరవమర్యాదలు పాటించాలి. అన్నిటికంటే ముఖ్యంగా మర్యాద రామన్న టైపులో వ్యక్తిత్వాన్ని కొనసాగించాలి. అప్పుడే కోరుకున్న పదవులు.. ఇంకా చాలా దక్కుతాయి. నేటి కాలంలో రాజకీయాలు సాగించేవారు లౌక్యాన్ని ప్రదర్శిస్తారు కాబట్టే.. అధికారాన్ని దక్కించుకుంటారు. అధికారానికి చేరువైనవారు మరింత లౌక్యాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది.

ఇటీవల తమిళనాడు ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ ప్రచారాన్ని జోరుగా సాగించారు. కానీ ఎక్కడ కూడా విమర్శలు చేయలేదు. అడ్డగోలుగా ఆరోపణలు చేయలేదు. బజారు భాష వాడలేదు. ఎప్పటికప్పుడు తమిళ ప్రజలను సవినయంగా వేడుకున్నారు. ఒక అవకాశం ఇవ్వండి అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా తమిళనాడును ఆవిష్కరించుకుందామని పదేపదే ఆయన ప్రజలను కోరారు. ప్రజలకు విజయ్ మాట్లాడిన మాటలు నచ్చాయి. ప్రతీకార రాజకీయాలు చూసిన ప్రజలకు విజయ్ మాట్లాడిన మాటలు కొత్తగా అనిపించాయి. అందువల్లే ఆయన ఓట్లకు డబ్బులు పంచకపోయినప్పటికీ.. విజిల్స్ మాత్రమే ఇచ్చినప్పటికీ ప్రజలు గొప్ప మనసుతో స్వీకరించారు. అందు గురించే ఎక్కువ సీట్లు ఇచ్చి విజయ్ కి ఆధిపత్యాన్ని అందించారు.

మ్యాజిక్ ఫిగర్ కు తగ్గట్టుగా విజయ్ సీట్లు సాధించలేకపోవడంతో తమిళనాడు ముఖ్యమంత్రి పీఠానికి కాస్త దూరంలో నిలిచారు. ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అవి ఏ క్షణమైనా ఫల ప్రదం కావచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. విజయ పార్టీకి అవసరమైన మద్దతును విసికె పార్టీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఆ పార్టీ మద్దతు కోరుతూ విజయ్ వాట్సాప్ లో లేఖ పంపించారు. ఇది కాస్త విసికె పార్టీ అధినేతత్వానికి ఆగ్రహాన్ని కలిగించింది. వాట్సాప్ లో లేఖ పంపిస్తే దానిని ఎలా అర్థం చేసుకోవాలని ఆ పార్టీ జనరల్ సెక్రెటరీ సెల్వన్ ట్విట్ చేశారు.

వాస్తవానికి ఇటువంటి సమయంలో విజయ్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. నేరుగా విజయ్ వెళ్లి సపోర్ట్ అడిగితే వీసీ కే పార్టీ నేతలు కచ్చితంగా ఆయనకు సపోర్ట్ ఇచ్చేవారు. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. కానీ విజయ్ కేవలం వాట్సాప్ లోనే లెటర్ పంపించారు. ఇక్కడ లౌక్యాన్ని ఆయన ప్రదర్శించలేదు. ఒక రాజకీయ నేతగా కూడా వ్యవహరించలేదు. అందువల్ల ఈ పరిస్థితి ఎదురయింది. ఇప్పటికైనా కూడా విజయ్ రాజకీయాలు నేర్చుకొని.. లౌక్యాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే ధోరణి కొనసాగించుకుంటూ వెళ్తే విజయ్ అధికారానికి దూరంగా ఉండాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular