Whatsapp : వాట్సాప్ వాడుతున్నారా? గుర్తు తెలియని నంబర్ల నుంచి మెసేజ్ లు వచ్చి ఇబ్బంది పెడుతున్నాయా ? అయితే మీకో గుడ్ న్యూస్! ఒక చిన్న సెట్టింగ్ మార్చడం ద్వారా ఇలాంటి అన్ వాంటెడ్ మెసేజ్‌లను బ్లాక్ చేయవచ్చు. చాలా మందికి తెలియని ఈ ప్రత్యేక ఫీచర్ మీ ప్రైవసీని కాపాడుతుంది. ఆ ఫీచర్ ఏమిటి? దాన్ని ఎలా ఆన్ చేయాలో ఈ వార్తలో చూద్దాం.
వాట్సాప్‌లో ‘Block Unknown account messages’ అనే ఒక ప్రత్యేకమైన ఫీచర్ దాగి ఉంది. ఈ ఫీచర్ నేరుగా అన్ని గుర్తు తెలియని నంబర్ల నుండి వచ్చే మెసేజ్‌లను బ్లాక్ చేయదు. కానీ, ఏదైనా గుర్తు తెలియని నంబర్ నుండి మీకు వరుసగా మెసేజ్‌లు వస్తుంటే ఈ ఫీచర్ ఆటోమేటిక్‌గా యాక్టివ్ అవుతుంది. ఆ నంబర్‌ను బ్లాక్ చేస్తుంది.
Also Read : వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇది మీకు ఉపయోగమేనా తెలుసుకోండి..
ఈ ఫీచర్‌ను ఎలా ఆన్ చేయాలి?
ఈ ఉపయోగకరమైన ఫీచర్‌ను మీ వాట్సాప్‌లో ఆన్ చేసుకోవడానికి ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి
* ముందుగా మీ వాట్సాప్ అప్లికేషన్‌ను ఓపెన్ చేయండి.
* కుడివైపు పైభాగంలో కనిపించే మూడు చుక్కల (మెనూ) ఐకాన్‌పై క్లిక్ చేయండి.
* ఆ మెనూలో మీకు ‘Settings’ ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి.
* సెట్టింగ్‌ల పేజీలో ‘Privacy’ ఆప్షన్‌ను ఎంచుకోండి.
* ప్రైవసీ పేజీలో కొంచెం క్రిందికి స్క్రోల్ చేస్తే ‘Advanced’ ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి.
* అధునాతన సెట్టింగ్‌ల పేజీలో మీకు ‘Block Unknown account messages’ అనే ఫీచర్ కనిపిస్తుంది. దానిని ఆన్ చేయడానికి టోగుల్ స్విచ్‌ను నొక్కండి.
ఇలా చేయడం ద్వారా, ఇకపై గుర్తు తెలియని నంబర్ల నుండి వచ్చే అన్ వాంటెడ్ మెసేజ్‌ల నుంచి మీరు ఉపశమనం పొందవచ్చు. మీ వాట్సాప్ మరింత సురక్షితంగా ఉంటుంది.
Also Read : అమ్మకానికి ఇన్‌స్టాగ్రామ్-వాట్సాప్? ఇంతకీ ఏం జరిగింది.
