Homeఎంటర్టైన్మెంట్Jr.NTR : ఎన్టీఆర్ కి జంటగా ఆ హీరోయిన్, అమ్మో వద్దంటున్న ఫ్యాన్స్!

Jr.NTR : ఎన్టీఆర్ కి జంటగా ఆ హీరోయిన్, అమ్మో వద్దంటున్న ఫ్యాన్స్!

Jr.NTR : ఎన్టీఆర్ లైనప్ అద్భుతంగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఎన్టీఆర్ జోరు మీదున్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో గ్లోబల్ ఫేమ్ రాబట్టారు ఎన్టీఆర్. ఆయనకు నార్త్ లో కూడా మార్కెట్ ఏర్పడింది. అందుకు దేవర రిజల్ట్ నిదర్శనం. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న దేవర హిందీలో రూ. 60 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. హిట్ టాక్ దక్కితే దేవర వసూళ్లు మరో స్థాయిలో ఉండేవి. తెలుగు రాష్ట్రాల్లో దేవర రికార్డు స్థాయిలో వసూలు చేసింది. వరల్డ్ వైడ్ దేవర రూ. 500 కోట్లు రాబట్టిన సంగతి తెలిసిందే. దేవరతో రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ ని కూడా బ్రేక్ చేశాడు ఎన్టీఆర్. ఆయనతో మూవీ చేసిన ఏ హీరో తదుపరి చిత్రం హిట్ కాలేదు.

Also Read : నమ్రత సెలెక్ట్ చేసిన స్క్రిప్ట్ లను మాత్రమే మహేష్ బాబు ఫైనల్ చేస్తాడా..?

ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2, డ్రాగన్ చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. ఇవి రెండు అత్యంత హైప్ తో కూడిన చిత్రాలు. వార్ 2 ఎన్టీఆర్ చేస్తున్న ఫస్ట్ డైరెక్ట్ బాలీవుడ్ మూవీ. హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నాడు. వార్ 2 చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఇటీవల దర్శకుడు ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ స్టార్ట్ చేశాడు. ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నారని సమాచారం. ప్రశాంత్ నీల్ చిత్రాలకు ఇండియాలో ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్ తెరకెక్కించడంలో ఆయన దిట్ట. కెజిఎఫ్, కెజిఎఫ్ 2, సలార్ చిత్రాలతో ప్రశాంత్ నీల్ ఇమేజ్ దేశవ్యాప్తం అయ్యింది.

ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్ మూవీ అనగానే అంచనాలు పెరిగిపోయాయి. డ్రాగన్ మూవీ డ్రగ్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతోందని సమాచారం. అలాగే ఈ మూవీలో ఎన్టీఆర్ కి జంటగా రుక్మిణి వసంత్ నటిస్తుంది. కాగా డ్రాగన్ మూవీలో శృతి హాసన్ సైతం భాగమైంది అనేది లేటెస్ట్ న్యూస్. ప్రశాంత్ నీల్ చిత్రాల్లో పెద్దగా సాంగ్స్ ఉండవు. కానీ ఎన్టీఆర్ కోసం సాంగ్స్ మీద కూడా ప్రశాంత్ నీల్ దృష్టి పెట్టాడట. ఒక ఐటెం సాంగ్ డిజైన్ చేశాడట. ఈ సాంగ్ లో శృతి హాసన్ నటిస్తుందని ఓ వార్త వెలుగులోకి వచ్చింది.

అయితే శృతి హాసన్ తో ఎన్టీఆర్ కి చేదు అనుభవం ఉంది. హరీష్ శంకర్ తెరకెక్కించిన రామయ్యా వస్తావయ్యా మూవీలో ఎన్టీఆర్-శ్రుతి హాసన్ జతకట్టారు. కానీ ఆ మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సెంటిమెంట్ రీత్యా శృతి హాసన్ వద్దంటున్నారు ఫ్యాన్స్. ఆమెకు బదులు మరొక హీరోయిన్ ని తీసుకోవాలని అంటున్నారు. కాగా సలార్ మూవీలో శృతి హాసన్ నటించిన సంగతి తెలిసిందే.

Also Read : దేవర 2 లో మహేష్ బాబు నటిస్తున్నాడా.?క్లారిటీ ఇచ్చిన దర్శకుడు…

RELATED ARTICLES

Most Popular