Somu Veerraju: కేంద్ర ప్రభుత్వం పెట్రో ధరలపై సెస్ తగ్గించడంతో పలు స్టేట్లు మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా విమర్శలు ఎదుర్కొంటున్నాయి. ఇన్నాళ్లు కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసిన స్టేట్లు ప్రస్తుతం తాజాగా పెట్రోల్ పై రూ.5, డీజిల్ పై రూ.10 సెస్ తగ్గించడంతో చాలా ప్రాంతాల్లో అక్కడి ప్రభుత్వాలు ధరలు తగ్గించడంతో ధరలు అదుపులోకి వచ్చాయి. బీజేపీ పాలిత ప్రాంతాల్లో తగ్గించినా మిగతా ప్రాంతాల్లో సీఎంలు సుముఖంగా లేరు. దీంతో ప్రజలపై భారం పడుతూనే ఉంది.

పెట్రోధరలపై ఏపీలో బీజీపీ రాష్ర్ట అధ్యక్షుడు సోము వీర్రాజు ఓ కొత్త వ్యాఖ్య చేసి సంచలనం రేపుతున్నారు. ఎప్పుడు వార్తల్లో నిలిచే వీర్రాజు తాజాగా ఏపీలో పెట్రో ధరలు తగ్గించకపోవడంపై ఓ కీలక ప్రకటన చేస్తున్నాడు. అదేమిటంటే పెట్రో చార్జీల్లో అమరావతి సెస్ కూడా వసూలు చేస్తున్నారని వివాదాస్పద ప్రకటన చేసి అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇంతకీ ఆయనకు ఎక్కడి నుంచి సమాచారం వచ్చింది? నిజంగానే ఏపీ అమరావతి సెస్ పేరుతో చార్జీలు వసూలు చేస్తోందా అనే అనుమానాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి.
పెట్రోల్, డీజిల్ అమ్మకాల్లో అమరావతి సెస్ ఉందనేది ఎవరకి కూడా తెలియదు. కానీ వీర్రాజు మాత్రం దీనిపైనే ఆరోపణలు చేస్తున్నారు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే పనిలో పడ్డారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులతో ప్రజలు విసిగిపోతున్నారని ఆరోపిస్తున్నారు. తన మాతృ సంస్థ సాక్షికి ప్రకటనలు ఇప్పించుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారని వాపోతున్నారు.
అమరావతి సెస్ పేరుతో కొత్త ప్రతిపాదన తెరమీదకు తెచ్చి వీర్రాజు అందరిలో ఉత్కంఠ రేపుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో వీర్రాజుకు ఇదివరకే అనుభవం ఉండటంతో ఎక్కువ మంది విశ్వసించడం లేదని తెలుస్తోంది. కానీ ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణతో జగన్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో రాష్ర్టంలో పరిణామాలు మరింతగా మారే సూచనలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది.
Also Read: KCR vs BJP: ఏకుమేకవుతున్న బీజేపీ.. కేసీఆర్ లో అందుకేనా ఫస్ట్రేషన్?