https://oktelugu.com/

Ananth Sriram: పాట విన్నాక చిరు స్వయంగా ఫోన్​ చేసి ఆ మాట అన్నారు!

Ananth Sriram: మెగాస్టార్​ చిరంజీవి, రామ్​చరణ్​ హీరోలుగా నటించిన సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న సినిమా ఇది. ఇటీవల ఈ సినిమా నుంచి నీలాంబరి వేరెవ్వరే నీలా మరి అనే పాట విడుదలైంది. ప్రస్తుతం ఈ పాట సోషల్​మీడియాలో తెగ వైరల్​ అవుతోంది. ఈ సాంగ్​ను ప్రముఖ రచయిత అనంత్​ శ్రీరామ్ రాశారు. అయితే, ఈ పాట రాయడానికి అనంత్​ శ్రీరామ్ చాలా కసరత్తులే చేశారట. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 8, 2021 / 12:27 PM IST
    Follow us on

    Ananth Sriram: మెగాస్టార్​ చిరంజీవి, రామ్​చరణ్​ హీరోలుగా నటించిన సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న సినిమా ఇది. ఇటీవల ఈ సినిమా నుంచి నీలాంబరి వేరెవ్వరే నీలా మరి అనే పాట విడుదలైంది. ప్రస్తుతం ఈ పాట సోషల్​మీడియాలో తెగ వైరల్​ అవుతోంది. ఈ సాంగ్​ను ప్రముఖ రచయిత అనంత్​ శ్రీరామ్ రాశారు. అయితే, ఈ పాట రాయడానికి అనంత్​ శ్రీరామ్ చాలా కసరత్తులే చేశారట. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాతో పాటు, పాటకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

    ఈ సినిమాలో హీరోయిన్​ చలాకీగా కనిపించే అల్లరి అమ్మాయి, అలాగే హీరో ఓ పెద్దాయన పెరిగిన, బిడియంతో ఉండే అబ్బాయంటూ చెప్పుకొచ్చారు.  అయితే, వీరిద్దరికి ప్రేమ పుట్టిన సమయంలో ఈ పాట వస్తుందని అన్నారు. ఈ క్రమంలోనే అమ్మాయి అందాన్ని, తన అల్లరి తనాన్ని వర్ణించే క్రమంలో ‘వేరెవ్వరే నీలా మరి… నీ అందమే నీ అల్లరి’ అంటూ పాటను ముందుకు తీసుకెళ్లినట్లు శ్రీరామ్​ తెలిపారు. అయితే, ప్రస్తుతం ఈ సాంగ్​ నెట్టింట వైరల్​గా మారడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ పాట విడుదలైన తర్వాత చిరంజీవి ఫోన్​ చేశారని అన్నారు. పాట విన్నాక మణిశర్మకు కాల్​ చేసి మాట్లాడినప్పటికీ సంతృప్తి కలగలేదని.. అందుకే నీకు కాల్​ చేశానని చిరు అన్నట్లు తెలిపారు.

    కొరటాల శివ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా.. ఫిబ్రవరి 4న విడదల కానుంది. మణిశర్మ​ ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నారు. 140 కోట్ల రూపాయలతో భారీ బడ్జెట్​తో ఈ సినిమా రూపొందిస్తున్నారు. మాట్నీ ఎంటర్​టైన్మెంట్​, కొనిదెల ప్రొడక్షన్స్​ సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమా ఇది.