Bheemla Nayak: ఆల్​టైమ్​ రికార్డులను కొల్లగొడుతున్న ‘లాలా భీమ్లా’!

Bheemla Nayak: పవర్​స్టార్​ పవన్​ కళ్యాణ్​ హీరోగా సాగర్​ కె. చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా భీమ్లానాయక్​. సినిమా ప్రమోషన్స్​లో భాగంగా వరుస అప్​డేట్స్​తో అభిమానుల్లో సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పుతోంది చిత్రబృందం. ఇప్పటికే విడుదలైన ప్రోమో, పోస్టర్స్​, సాంగ్స్​ నెట్టింట వైరల్​గా మారాయి. కాగా, ఇటీవలే విడుదలైన లాలా భీమ్లా లిరికల్​ వీడియో సాంగ్​ విడుదలైంది. విడుదలైన 24 గంటల్లోనే రికార్డుల మోత మోగించింది. గడిచిన 24 గంటల్లో యూట్యూబ్​లో 10.20 మిలియన్​ వ్యూస్​కు చేరుకుంది. […]

Written By: Raghava Rao Gara, Updated On : November 8, 2021 12:47 pm
Follow us on

Bheemla Nayak: పవర్​స్టార్​ పవన్​ కళ్యాణ్​ హీరోగా సాగర్​ కె. చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా భీమ్లానాయక్​. సినిమా ప్రమోషన్స్​లో భాగంగా వరుస అప్​డేట్స్​తో అభిమానుల్లో సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పుతోంది చిత్రబృందం. ఇప్పటికే విడుదలైన ప్రోమో, పోస్టర్స్​, సాంగ్స్​ నెట్టింట వైరల్​గా మారాయి. కాగా, ఇటీవలే విడుదలైన లాలా భీమ్లా లిరికల్​ వీడియో సాంగ్​ విడుదలైంది. విడుదలైన 24 గంటల్లోనే రికార్డుల మోత మోగించింది. గడిచిన 24 గంటల్లో యూట్యూబ్​లో 10.20 మిలియన్​ వ్యూస్​కు చేరుకుంది. దీంతో ఆల్​టైమ్​ టాప్​లో దూసుకుపోతోంది. అదే విధంగా 658కే పైగా లైక్స్​తో ఆల్​టైమ్ సెకెండ్​లో నిలిచింది. మొత్తానికి ఈ పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోందని అర్థమైంది.

సితార ఎంటర్​టైన్మెంట్​ బ్యానర్​పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. రానా దగ్గుబాటి ఇందులో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. నిత్యా మీనన్​ పవన్​ సరసన కనిపించనుండగా.. రానాకు జోడీగా సంయుక్త మేనన్​ నటిస్తోంది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ శ్రీనివాస్​ మాటలు అందిస్తుండటం విశేషం. తమన్ సంగీతం అందిస్తున్నారు. మరో విశేషమేంటంటే.. లాలా భీమ్లా సాంగ్​కు రచనలు అందించింది త్రివిక్రమ్​. నవంబరు 7న త్రివిక్రమ్​ పుట్టినరోజు సందర్భంగా ఈ పాటను విడుదల చేశారు. పాటలోనూ తన ప్రాసను వదలకుండా.. వేరే లెవెల్​ లిరిక్స్​ను అందించి.. అభిమానుల్లో జోష్​ను పెంచారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానుంది.