ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. అన్నట్టుగా పరిస్థితి తయారైంది జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ది. తాను ఒకటి తలచుకుంటే మరొకటి జరుగుతుంది ఆయనకు. పార్టీ ప్రారంభించనప్పటి నుంచి పవన్‌కు ఏదో ఒక అవాంతరం జరుగుతుండడంతో పాటు అనుకున్నవన్నీ కలిసిరాకపోవడం ఇబ్బందిగా మారింది. గత ఎన్నికల్లో సొంతంగా పార్టీ పెట్టి ఎంతో కష్టపడి తన వ్యాఖ్యలతో ఆకట్టుకున్నా ప్రజాబలం సంపాదించలేకపోయారు పవన్. ఇప్పుడు పొత్తు అనే సలహాలతో కొన్ని పార్టీలకు మద్దతు పలుకుదామనుకున్నా అదీ రివర్స్‌గానే మారుతోంది.
Also Read: బీజేపీ మౌనం వెనుక అర్థం ఏంటీ..?
అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుతోనే నెగ్గుకొచ్చిన పవన్ ఆ తరువాత జనసేన సిద్ధాంతాలను మార్చాలనుకున్నాడు. ముందు తాను కమ్యూనిస్టులకు మద్దతు అంటూ.. ఇప్పుడు వారికి వ్యతిరేకంగా బీజేపీకి వత్తాసు పలుకుతున్నాడు. సన్నిహితులు ఇచ్చిన సలహాల మేరకు మెల్లిమెల్లిగా బీజేపీకి చేరువయ్యాడు.
అటు బీజేపీకి ఢిల్లీలో దగ్గరగా… రాష్ట్రంలో దూరంగా ఉంటూ వస్తున్న జగన్ ఆలోచన ఎవరికీ అంతుబట్టలేదు. అసలు జగన్ బీజేపికి సపోర్టా..? లేక వ్యతిరేకమా..? అన్న అనుమానం అందరిలో నెలకొంది. అయితే ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో జగన్, బీజేపీ పొత్తు తేట తెల్లమైంది. రాజ్యసభ చైర్మన్ ఎన్నికకు వైసీపీ మద్దతు పలకడంతో ఇక జగన్, బీజేపీకి మద్దతు అని తేలిపోయింది.
అయితే అంతకుముందు ఈ రాజకీయాలు అర్థం కాని పవన్ మాత్రం బీజేపీకి సన్నిహితంగా ఉంటూ వచ్చారు. బీజేపీ అండ చూసుకొని జగన్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చాడు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకుంటూ లాభం ఉండొచ్చనే ఆలోచనతో ఆ విధంగా మెలిగాడు. కానీ పరస్థితి తారుమారైంది. తాను తలుచుకున్నదొకటైతే.. జరిగిందొకటి.. ఇటీవల జగన్ బీజేపీతో పొత్తు పెట్టుకోవచ్చనే వార్తలు వస్తున్నాయి. అందుకు అనుగుణంగానే ఏపీ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన, మోడీతో మంతనాలు చేస్తున్నారు.
Also Read: ప్చ్.. దసరాకు బస్సులు లేనట్లేనా?
దీంతో పవన్ పరిస్థితి అయోమయంగా తయారైంది. ఇన్నాళ్లు జగన్‌ను ఆడిపోసుకున్న పవన్ ఇప్పుడు జగన్ బీజేపికి మద్దతు ఇస్తే ఆయనను తిట్టాలా..? లేక పొగడాలా.? అనేది అర్థం కాకుండా తయారైంది. దీంతో ముందు నుయ్యి.. వెనుక గొయ్య అన్న పరిస్థితి తయారైంది పవన్‌కు..