https://oktelugu.com/

ప్చ్‌.. దసరాకు బస్సులు లేనట్లేనా?

దేశ మంతటా ప్రస్తుతం అన్‌లాక్‌ 5.0 నడుస్తోంది. అన్‌లాక్‌ 4.0 గైడ్‌లైన్స్‌లోనే అంతర్రాష్ట్ర రవాణాపై ఎలాంటి ఆంక్షలు పెట్టొద్దంటూ సూచించింది. ఆంక్షలు విధిస్తే నిబంధనలు ఉల్లంఘించినట్లే అవుతుందని చెప్పింది. దీంతో తెలంగాణ–ఆంధ్ర మధ్య ఆంక్షలు తొలిగి ఆర్టీసీ బస్సులు ప్రారంభం అవుతాయని అందరూ భావించారు. అయితే.. తెలంగాణలో రవాణా వ్యవస్థపై ఎలాంటి ఆంక్షలైతే కొనసాగడం లేదు. కానీ.. ఇంతవరకైతే సర్వీసులు ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో అసలు సమస్య ఎక్కడ ఉందనేది సర్వత్రా చర్చ సాగుతోంది. అయితే […]

Written By:
  • NARESH
  • , Updated On : October 8, 2020 / 02:54 PM IST
    Follow us on

    దేశ మంతటా ప్రస్తుతం అన్‌లాక్‌ 5.0 నడుస్తోంది. అన్‌లాక్‌ 4.0 గైడ్‌లైన్స్‌లోనే అంతర్రాష్ట్ర రవాణాపై ఎలాంటి ఆంక్షలు పెట్టొద్దంటూ సూచించింది. ఆంక్షలు విధిస్తే నిబంధనలు ఉల్లంఘించినట్లే అవుతుందని చెప్పింది. దీంతో తెలంగాణ–ఆంధ్ర మధ్య ఆంక్షలు తొలిగి ఆర్టీసీ బస్సులు ప్రారంభం అవుతాయని అందరూ భావించారు. అయితే.. తెలంగాణలో రవాణా వ్యవస్థపై ఎలాంటి ఆంక్షలైతే కొనసాగడం లేదు. కానీ.. ఇంతవరకైతే సర్వీసులు ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో అసలు సమస్య ఎక్కడ ఉందనేది సర్వత్రా చర్చ సాగుతోంది. అయితే ఇరు రాష్ట్రాల మధ్య ఎక్కువ సర్వీసులు తమవే అంటే తమవే ఉండాలంటున్న ఇరురాష్ట్రాల గొడవతోనే ఇలా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

    Also Read: తెలంగాణలో స్కూల్స్‌ తెరుచుకునేది అప్పుడే.!

    వివిధ రాష్ట్రాల మధ్య అన్ని ఆంక్షలు ఎత్తివేసి అన్నిరకాల సర్వీసులు తిరుగుతూనే ఉన్నాయి. కానీ.. మన తెలుగు రాష్ట్రాల మధ్య ఇంకా కొలిక్కి రావడం లేదు. ఆర్టీసీ బస్సుల పునఃప్రారంభంపై తెలంగాణ ఆర్టీసీ అధికారులతో రెండు దఫాలుగా చర్చలు చేపట్టినా అవి ఫలితం ఇవ్వలేదు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసుల పునరుద్ధరణకు సంబంధించి ఇరురాష్ట్రాల ఉన్నతాధికారుల మధ్య జరిగిన చర్చలు మరోమారు సందిగ్ధంగానే ముగిశాయి. అంతర్ రాష్ట్రాల మధ్య బస్సులను పునరుద్ధరించడం, రవాణా కొనసాగించటంపై ఎలాంటి నిర్ణయం లేకుండా అధికారులు ఇంకోసారి చర్చిద్దాం అంటూ ముగించారు.

    ఏపీ, తెలంగాణకు చెందిన ఆర్టీసీ సంస్థల అధికారుల మధ్య బుధవారం సాయంత్రం చర్చలు జరిగాయి. కిలోమీటర్లలో సమానత్వంతో పాటు రూట్లలో కూడా సమాన సర్వీసులు ఉండాలనే విషయంపై ప్రతిష్టంభన నెలకొంది .ఈ నెలాఖరులోగా లేదా వచ్చే నెలలోగా తిరిగి చర్చలు ప్రారంభమవుతాయని వర్గాలు తెలిపాయి.

    అయితే.. మునుముందు దసరా పండుగ రాబోతోంది. ఆ పండుగకి కూడా ఆర్టీసీ బస్సులు ఇరు రాష్ట్రాల మధ్య రోడ్డెక్కే పరిస్థితి కనిపించటం లేదు . ఇప్పుడు మరోమారు భేటీ అవుతామని చెప్పిన అధికారులు దసరాలోపు భేటీ అయితే ఆర్టీసీ బస్సుల రవాణాపై స్పష్టత వస్తుందా అనేది మాత్రం ప్రశ్నగానే ఉంది . మరోపక్క దేశం అంతా ప్రయాణాలకు ఇబ్బంది లేకుండా ఉన్నా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బస్సులు లేకపోవటం తెలుగురాష్ట్రాల ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది .

    Also Read: కేసీఆర్‌ కన్నా జగన్‌ బెటర్‌..! ఎందుకంటే.?

    ఎన్ని కిలోమీటర్లు బస్సులను నడపాలన్న దానిపైన ఇంతకు ముందు ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు భేటీలో చర్చల్లో పురోగతి సాధించినా మరోమారు తాజాగా జరిగిన చర్చల్లో మొత్తం 2.65 లక్షల కిలోమీటర్లకు 65 వేల తగ్గించుకుంటామని గతంలో చెప్పిన ఏపీ ఇప్పుడు మళ్లీ మరో 40 వేల కిలోమీటర్లు తగ్గించుకునేందుకు సుముఖత వ్యక్తం చేసింది. అయితే తెలంగాణ అధికారులు తాజాగా లక్షా 61 వేల కిలోమీటర్లు తాము నడుపుకుంటామని, ఏపీ కూడా అదే విధంగా సమాన కిలోమీటర్లు నడపాలని ప్రతిపాదించింది . దీనిపై మళ్ళీ అలోచించి చెప్తామని ఏపీ ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు . ఈ రెండు రాష్ట్రాల వైఖరి అటు ప్రైవేటు బస్సుల వారికి ఉపయోగంగా మారింది. ఆర్టీసీ బస్సులు ఎలాగూ నడిపించకపోవడంతో ప్రైవేటు ట్రావెల్స్‌ వారు దండుకుంటున్నారు. ఫలితంగా ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఇరు ఆర్టీసీలు.. మరిన్ని నష్టాల్లోకి కూరుకుపోతున్నాయి