https://oktelugu.com/

Kodali Nani: కొడాలి నానికి సీఎం జగన్ చెప్పిన సీక్రెట్ ఏంటి?

Kodali Nani: ఆంధ్రప్రదేశ్ లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. నిన్న కొత్త మంత్రివర్గంతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ మేరకు 11 మంది పాత, 14 మంది కొత్త మంత్రులతో కేబినెట్ విస్తరణ పూర్తయింది. దీంతో పదవులు రాని వారు అసంతృప్తికి గురవుతున్నా కొడాలి నాని మాత్రం తనకు సీఎం జగన్ ఏ బాధ్యత అప్పగించినా సమర్థంగా నెరవేరుస్తానని చెబుతుండటం విశేషం. కొడాలి నాని పెదవి విప్పితే ప్రతిపక్షాలకు భయమే. ఏం మాట్లాడతాడోనని వణికిపోతుంటారు. అలాంటిది నానికి మాత్రం […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 12, 2022 / 10:55 AM IST
    Follow us on

    Kodali Nani: ఆంధ్రప్రదేశ్ లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. నిన్న కొత్త మంత్రివర్గంతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ మేరకు 11 మంది పాత, 14 మంది కొత్త మంత్రులతో కేబినెట్ విస్తరణ పూర్తయింది. దీంతో పదవులు రాని వారు అసంతృప్తికి గురవుతున్నా కొడాలి నాని మాత్రం తనకు సీఎం జగన్ ఏ బాధ్యత అప్పగించినా సమర్థంగా నెరవేరుస్తానని చెబుతుండటం విశేషం. కొడాలి నాని పెదవి విప్పితే ప్రతిపక్షాలకు భయమే. ఏం మాట్లాడతాడోనని వణికిపోతుంటారు. అలాంటిది నానికి మాత్రం మంత్రి పదవి దక్కకపోవడం అందరికి ఆశ్చర్యానికి గురిచేసింది.

    Kodali Nani, JAGAN

    కొడాలి నాని సామాజిక వర్గానికి మంత్రిమండలిలో స్థానం లేకుండా పోవడం గమనార్హం. మంత్రి పదవి ఉన్నా లేకున్నా తాను జగన్ వెంటే ఉంటానని చెబుతున్నారు సొంత మామను వెన్నుపోటు పొడిచన చంద్రబాబు లాంటి నైజం తనది కాదని స్వామి భక్తి ఉందని వివరిస్తున్నారు. మంత్రి పదవులు శాశ్వతం కాదని అభిమానమే ఎప్పటిదని చెబుతున్నారు. విపక్షాల ప్రలోభాలకు గురికాకుండా జగన్ కు మద్దతుగా నిలవాలని సూచిస్తున్నారు.

    Also Read: Jagan New Cabinet: ఇదేనా సామాజిక న్యాయం?..అగ్రవర్ణాలకు దక్కని అమాత్య యోగం

    మంత్రి పదవి కోసం తాను ఎప్పుడు తాపత్రయడలేదన్నారు. పదవుల కోసం ఎవరిని తిట్టలేదని చెబుతుండటం గమనార్హం. పార్టీ భవితవ్యంపై జగన్ ఏ బాధ్యతలు అప్పగించినా నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కొడాలి నానికి బాధ్యతాయుతమైన పదవి ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. నాని మాటల్లో ఆంతర్యమేమిటని ఆలోచన అందరిలో వస్తోంది. జగన్ ఏ బాధ్యతలు సూచించినా తూచ తప్పకుండా పాటించేందుకు రెడీ అయిపోతున్నట్లు తెలుస్తోంది.

    Kodali Nani

    ప్రస్తుతం రాష్ర్టంలో కొనసాగుతున్న పరిణామాల దృష్ట్యా జగన్ పై చాలా మంది అసంతృప్తి ప్రకటిస్తున్నా కొడాలి నాని మాత్రం తాను ఏ పని అప్పగించినా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. భవిష్యత్ లో కూడా జగన్ వెంట నడిచేందుకు నిర్ణయించుకున్నారు. పదవి ఉన్నా లేకపోయినా ఒకేలా ఉంటానని సూచిస్తున్నారు. కొడాలి నాని అందరిలో ఉన్న అసమ్మతి పోగొట్టేలా ప్రయత్నిస్తున్నా కొందరు మాత్రం వినడం లేదు. తమకు పదవులే ముఖ్యమని చెబుతున్నట్లు తెలుస్తోంది.

    జగన్ తనకు ఓ హామీ ఇచ్చారని చెబుతున్నారు. అది తనకు జగన్ కు మాత్రమే తెలుసన్నారు. ఇంతకీ జగన్ ఏం హామీ ఇచ్చారనే దానిపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి నానికి ఏదో బాధ్యతాయుతమైన పదవి కట్టబెట్టేందుకే జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

    Also Read:YCP Leaders Protest: ఆ హామీలే సీఎం జగన్ మెడకు చుట్టుకున్నాయా? రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వైసీపీ నిరసనలు

    Tags