https://oktelugu.com/

KGF 2 Breaks RRR Records: విడుదల కి ముందే RRR రికార్డ్స్ ని బ్రేక్ చేసిన KGF 2

KGF 2 Breaks RRR Records: ఇండియన్ సినీ అభిమానులు అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియన్ సినిమాలలో ఒక్కటి KGF చాప్టర్ 2 ,2018 వ సంవత్సరం లో వచ్చిన KGF చాప్టర్ 1 ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, విడుదల అయినా అన్ని ప్రాంతీయ బాషలలో అంచనాలను మించి ఈ సినిమా ఘన విజయం సాధించి కాసుల వర్షం కురిపించింది..అంతతి భారీ బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 12, 2022 / 10:54 AM IST
    Follow us on

    KGF 2 Breaks RRR Records: ఇండియన్ సినీ అభిమానులు అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియన్ సినిమాలలో ఒక్కటి KGF చాప్టర్ 2 ,2018 వ సంవత్సరం లో వచ్చిన KGF చాప్టర్ 1 ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, విడుదల అయినా అన్ని ప్రాంతీయ బాషలలో అంచనాలను మించి ఈ సినిమా ఘన విజయం సాధించి కాసుల వర్షం కురిపించింది..అంతతి భారీ బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ అవ్వడం తో KGF చాప్టర్ 2 కి అన్ని బాషలలో బాహుబలి పార్ట్ 2 కి విడుదల కి ముందు ఎలాంటి క్రేజ్ మరియు హైప్ ఉన్నదో, అదే స్థాయిలో KGF చాప్టర్ 2 మీద కూడా ఉన్నది..ఇప్పటికే అన్ని ప్రాంతాలలో దాదాపుగా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి..ఈ అడ్వాన్స్ బుకింగ్స్ కనివిని ఎరుగని రేంజ్ లో జరుగుతున్నాయి అని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త,ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ చూసి అక్కడ విడుదలకి సిద్ధంగా ఉన్న ఒక్క ప్రముఖ స్టార్ హీరో సినిమా షాహిద్ కపూర్ నటించిన జెర్సీ సినిమా కూడా వాయిదా పడింది అంటే KGF బ్రాండ్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

    KGF 2 Breaks RRR Records

    ఇక ఇటీవల విడుదల అయినా రాజమౌళి భారీ మల్టీస్టార్ర్ర్ #RRR చిత్రం ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, అన్ని ప్రాంతీయ బాషలలో ఈ సినిమా ఒక్క ప్రభంజనమే సృష్టించింది..అయితే ఇప్పుడు KGF చాప్టర్ 2 కి జరుగుతున్నా అడ్వాన్స్ బుకింగ్స్ మరియు క్రేజ్ ని చూస్తూ ఉంటే, #RRR సినిమా కలెక్షన్స్ ని చాలా చోట్ల KGF డబల్ మార్జిన్ తో కొట్టే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాల అంచనా..ముఖ్యంగా బాలీవుడ్ లో KGF అడ్వాన్స్ బుకింగ్స్ ఒక్క సెన్సేషన్ గా మారింది, విడుదలకి ముందు రోజు #RRR కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా దాదాపుగా 6 కోట్ల 70 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది,ఇక సినిమా విడుదల అయ్యి మొదటి రోజు పూర్తి చేసుకున్న సమయానికి ఈ సినిమా హిందీ వెర్షన్ మొదటి రోజు దాదాపుగా 28 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది..అయితే ఈ రికార్డు ని KGF చాప్టర్ 2 విడుదల కి రెండు రోజుల ముందే భారీ మార్జిన్ తో బద్దలు కొట్టి అందరిని ఆశ్చర్యపొయ్యేలా చేసింది, ఇంకా విడుదలకి రెండు రోజుల సమయం మిగిలి ఉన్నా కూడా ఈ సినిమా కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా దాదాపుగా 12 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది..అంటే విడుదలకి ముందు రోజు #RRR అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వసూలు చేసిన గ్రాస్ కంటే రెండింతలు ఎక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వసూలు చేసింది KGF.

    Also Read: ‘కేజీఎఫ్ 2’ ఫస్ట్ డిటైల్డ్ రివ్యూ

    ఇక విడుదల కి ముందు రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా KGF చాప్టర్ 2 దాదాపుగా 14 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాల అంచనా..ఈ ట్రెండ్ ని బట్టి చూస్తుంటే KGF మొదటి రోజు మొత్తం మీద కచ్చితంగా 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసే అవకాశం ఉంది ట్రేడ్ వర్గాల అంచనా..అంటే #RRR మొదటి రోజు వసూళ్ల కంటే రెండింతలు ఎక్కువ వసూలు చేయబోతుంది అన్నమాట,ఒక్క బాలీవుడ్ లో మాత్రమే కాదు, కోలీవుడ్ , శాండిల్ వుడ్ మరియు మాలీవుడ్ లో కూడా KGF చాప్టర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ ఒక్క ప్రభంజనం లాగ మారింది, ట్రేడ్ పండితుల విశ్లేషణ ప్రకారం ఈ సినిమా మొదటి రోజు అన్ని భాషలకు కలిపి దాదాపుగా 150 కోట్ల రూపాయిల వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది అని తెలుస్తుంది..అయితే ఈ సినిమా ఫుల్ రన్ లో #RRR కలెక్షన్స్ ని అందుకుంటుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి, #RRR సినిమా ఇటీవలే ప్రతిష్టాత్మక వెయ్యి కోట్ల రూపాయిలు కలెక్ట్ చేసిన సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి మన అందరికి తెలిసిందే, మరి KGF రేంజ్ ఏ స్థాయిలో ఉంటుందో అనేది తెలియాలి అంటే మరికొద్ది రోజులు వేచి చూడాలి.

    Also Read: తెలుగు ప్రేక్షకులు దేవుళ్ళతో సమానం – హీరో యాష్

    Tags