Balmuri Venkat: హుజూరాబాద్‌లో ఇంకా పోరు కొనసాగుతోంది. తుది ఫలితం ఇంకా రాలేదు. ఇప్పటి వరకు 17 రౌండ్ల ఫలితాలు వచ్చాయి. ఇందులో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 1423 ఓట్ల మెజారిటీ వచ్చింది. మొత్తానికి 17 రౌండ్లు ముగిసే సరికి 14,618 ఓట్ల మెజారిటీ ఓట్లతో ఈటల ముందజలో ఉన్నారు. అక్కడ బీజేపీ గెలుపు ఖాయమనే చెప్పవచ్చు. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాలను ఆధారంగా చేసుకొని ఇక గెలుపు సునాయాసమే అని తెలుస్తోంది. అయితే ఇక్కడ మనం ఒక అభ్యర్థి గురించి మాట్లాడుకోవాలి. విద్యార్థి నాయకుడిగా మంచి పేరున్న ఆ నాయకుడిని కావాలనే హుజూరాబాద్ ఎన్నికల్లో పోటీ చేపించి బలి చేశారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతకీ ఎవరా నాయకుడు అంటారా ? అదేనండి కాంగ్రెస్ అభ్యర్థి బాల్మూరి వెంకట్.

కనీస డిపాజిట్ దక్కలె..
రాష్ట్రంలో కాంగ్రెస్‌కు బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఎన్ని పార్టీలు వచ్చిన కాంగ్రెస్ సంస్థాగత ఓటు బ్యాంకు ఎటూ పోదు. 70 ఏళ్ల నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఇంకా అభిమానం తగ్గలేదు. ఇప్పటికీ తెలంగాణ ప్రజలకు రాష్ట్రం ఇచ్చిన పార్టీ అని అభిమానం ఉంది. కొందరైతే అక్కడ అభ్యర్థి ఎవరు ? ఏ ఎన్నికలు అని కూడా చూడరు. గుడ్డిగా వెళ్లి అక్కడ కాంగ్రెస్‌కు ఓటు వేసి వస్తారు. అంత పిచ్చి అభిమానం ఇప్పటికీ ప్రజల్లో కనిపిస్తుంది. కానీ ఈరోజు వెల్లడైన హుజూరాబాద్ ఫలితాలు ఏం చెబుతున్నాయి. కాంగ్రెస్ కు కనీసం డిపాజిట్ దక్కకపోవడానికి కారణాలేంటి అనే అంశంపై నిశితంగా పరిశీలన జరపాల్సి ఉంటుంది.
కావాలనే చేశారా ?
హుజూరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓట్లు తక్కువ రావడం వెనక ఎన్నో కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ ను గెలవకుండా చేసేందుకు కాంగ్రెస్ బీజేపీకి సహకరించిందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్ సంస్థాగత ఓట్లన్నీ బీజేపీకి మళ్లించడంలో కాంగ్రెస్ సక్సెస్ అయ్యిందని చెబుతున్నారు. నిజామాబాద్ ఎంపీ ఎన్నికల్లో కూడా ఇలానే జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇక్కడ వీళ్ల రాజకీయాల వల్ల పరువు పోగొట్టుకున్నారు విద్యార్థి నాయకుడు బాల్మూరి వెంకట్. ఆయనకు ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా మంచి పేరు ఉంది. ఆయనను తీసుకొచ్చి కాంగ్రెస్ తరఫున హుజూరాబాద్‌లో పోటీ లో నిలిపారు. కానీ ప్రచారంలో ప్రతీ చోట వెనకే ఉన్నారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు పెద్దగా కష్టపడినట్టు కూడా కనిపించలేదు. కేవలం పోటీ చేస్తున్నామని తెలుపడానికి నాలుగైదు చోట్ల సభలు నిర్వహించారు. దీంతో బీజేపీకి, కాంగ్రెస్‌కు మధ్య ఏదో ఒప్పందం జరిగిందని, అందుకే కాంగ్రెస్‌కు డిపాజిట్ లు కూడా రాలేదని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. అయితే ఇక్కడ బల్మూరి వెంకట్ ను బలి పశువును చేశారని చెబుతున్నారు. కనీసం సంస్థాగత ఓట్లు కూడా పడలేదు అంటే అక్కడ ఏదో కుమ్మకు జరిగిందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
Also Read: Huzuraba By Election: అయిపాయే..! ఈటల గెలిచే.. ‘కమలం’ వికసించే.. ‘గులాబీ’ వాడిపాయే!