TMC: దేశంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు నేడు వెలువడ్డాయి. ఇందులో పశ్చిమ బెంగాల్ లో నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ విజయబావుటా ఎగురవేసింది. దీంతో ప్రతిపక్ష పార్టీలు కుదేలయిపోయాయి. గత ఎన్నికల కంటే భారీ మెజార్టీ ఓట్లు సాధించడం గమనార్హం. టీఎంసీ అభ్యర్థులు సమీప ప్రత్యర్థులు బీజేపీ అభ్యర్థులపై విజయఢంకా మోగించారు.

గోసబా అసెంబ్లీ స్థానంలో టీఎంసీ అభ్యర్థి సబ్రతా మోండల్ బీజేపీ అభ్యర్థి పలాష్ రాణాపై 1,43,051 ఓట్ల తేడాతో విజయం సాధించడం తెలిసిందే. దిన్ హటా నియోజకవర్గంలో టీఎంసీ అభ్యర్థి ఉదయన్ గుహా తన సమీప బీజేపీ అభ్యర్థి అశోక్ మండల్ పై 1,64,089 ఓట్ల భారీ తేడాతో విజయం సాధించారు. ఖర్దా స్థానంలో టీఎంసీ అభ్యర్థి సోవన్ దేవ్ చటోపాధ్యాయ్ 94 వేల ఆధిక్యాన్ని సమీప ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థిని ఓడించారు. శాంతిపూర్ స్థానంలో టీఎంసీ అభ్యర్థి సమీప బీజేపీ అభ్యర్థి పై 64 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.
దీంతో రాష్ర్టంలో టీఎంసీ నాలుగు స్థానాలను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. కేంద్ర ప్రభుత్వంపై ఉన్న ద్వేషంతోనే ఇంత భారీ స్థాయిలో ప్రజలు మెజార్టీ కట్టబెట్టారని గుర్తు చేశారు. ఎన్నికల ఫలితాలపై దీదీ స్పందిస్తూ బెంగాల్ ప్రజలు ఎప్పుడు అభివృద్ధిని ఆశీర్వదిస్తారని చెప్పారు. రాజకీయాలకంటే అభివృద్ధి కే పెద్దపీట వేస్తారని చెప్పారు.
పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దూకుడు కొనసాగుతోంది. నాలుగు సీట్లలో రెండు సీట్లు దిన్ హటా, శాంతిపూర్ లో బీజేపీ సిట్టింగ్ అభ్యర్థులున్నా తృణమూల్ అభ్యర్థులు విజయం సాధించడం గమనార్హం. దీంతో బీజేపీ అభ్యర్థులపై పార్టీ పోస్టుమార్టమ్ నిర్వహించనుంది. ఓటమికి గల కారణాలను అన్వేషిస్తోంది.
Also Read: Huzurabad By Poll Results: కేసీఆర్ కు చెక్: హుజూరాబాద్ లో గెలిచింది ‘ప్రజలే’