Homeఎంటర్టైన్మెంట్Akhanda Movie: దీపావళి కానుకగా సాంగ్ టీజర్ ను రిలీజ్ చేయనున్న "అఖండ" టీమ్...

Akhanda Movie: దీపావళి కానుకగా సాంగ్ టీజర్ ను రిలీజ్ చేయనున్న “అఖండ” టీమ్…

Akhanda Movie: నందమూరి నటసింహం బాలయ్య – బోయపాటి కాంబినేషన్​లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా “అఖండ “. గతంలో వీరిద్దరి కాంబినేషన్​లో ‘సింహా’, ‘లెజెండ్​’ చిత్రాలు విడుదలై ఘన విజయం సాధించాయి. ఇప్పుడు మూడో సినిమాతో తమ సత్తా చూపించేందుకు వీరిద్దరూ  సిద్ధమవుతున్నారు. ఇందులో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా నటించింది. కాగా శ్రీకాంత్, పూర్ణ… ప్రతి నాయక ఛాయలున్న పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం మరి ప్రత్యేకత కానుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచియా దిరిపోయే అప్డేట్ ను మూవీ యూనిట్ ప్రకటించింది.

akhanda movie team going to release title song teaser on november 4th

ఈ మేరకు దసరా సందర్భంగా నవంబరు 4న అఖండ సాంగ్ టీజర్​ ​ను ఉదయం 11.43 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. పూర్తి వీడియోను 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో బాలయ్య.. డిఫరెంట్ గెటప్స్​లో కనిపించనున్నారు.​ అంతకుముందు ఈ చిత్రంలోని ఓ సాంగ్​, రెండు టీజర్​లు​ విడుదలై అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

సి.రాంప్రసాద్​ ఛాయాగ్రహణం చేశారు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్​ ప్రొడక్షన్స్​ పనులు చేసుకుంటుంది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ – గోపీచంద్‌ మలినేని కలయికలో ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుంది. ఆ తర్వాత బాలకృష్ణ చేయనున్న చిత్రం ఖరారైన విషయం తెలిసిందే. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించనున్నారు. ఇక ఈ తాజా అప్డేట్ తో బాలయ్య ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం నెలకొంది. కాకపోతే మరోవైపు బాలయ్య హాస్పిటల్ లో చేరారన్న వార్తతో ఆయన అభిమానుల్లోఆందోళన నెలకొంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version