Chiranjeevi Works With Sreekanth Odela: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కుర్రదర్శకుల హవా పెరిగిపోతుంది. ముఖ్యంగా శ్రీకాంత్ ఓదెల లాంటి దర్శకుడు చేసింది ఒకటే సినిమా అయినప్పటికి తనమీద ఇండస్ట్రీ మొత్తం భారీ అంచనాలైతే పెట్టుకుంటున్నారు. ఇక స్టార్ హీరోలు సైతం అతనితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రీసెంట్ గా నాని బర్త్ డే సందర్భంగా ఆయన నానితో చేస్తున్న ‘ప్యారడైజ్’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గా ఒక సాంగ్ అయితే వచ్చింది. ఆ సాంగ్ ప్రేక్షకులందరిని విశేషంగా ఆకట్టుకుంటుంది. అందులో నాని మేనరిజమ్స్ గాని అతని స్టైల్ గాని ప్రేక్షకులందరిలో కొత్త జోష్ అయితే నింపుతుంది. ఇక ఇంతకుముందు ప్యారడైజ్ నుంచి వచ్చిన గ్లింప్స్ తోనే ఈ సినిమా పూర్తి అటెన్షన్ తన వైపు తిప్పుకుంది.ఇక నాని సైతం శ్రీకాంత్ ఓదెల కు పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రతి విషయంలో నాని ఇన్వాల్వ్ మెంట్ తగ్గించుకొని శ్రీకాంత్ ఏదైతే చేయాలనుకుంటున్నాడో అది చేయడానికి తనకి పూర్తి స్వేచ్ఛను ఇచ్చాడట. అందువల్లే బెస్ట్ అవుట్ పుట్ రావడానికి అవకాశమైతే దక్కుతుందని శ్రీకాంత్ ఓదెల నాని బర్త్ డే సందర్భంగా ఒక ఎమోషనల్ పోస్ట్ అయితే రిలీజ్ చేశాడు. ఇక ఏది ఏమైనా కూడా నాని వల్లే తను ఈరోజు ఇక్కడ ఉన్నానని శ్రీకాంత్ చెబుతూ ఉండటం విశేషం…
సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం ఇండస్ట్రీ ని షేక్ చేసే సినిమాలను చేస్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక నాని తర్వాత చిరంజీవితో ఆయన ఒక భారీ గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
ఇక ఈ సినిమా ఆగస్టు 21వ తేదీన రిలీజ్ అవుతుంది. కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చిరంజీవి సినిమా మీద శ్రీకాంత్ ఫుల్ టైం ఫోకస్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది… నాని చిరంజీవి ఇద్దరు శ్రీకాంత్ ను నమ్మారు అంటే అతనిలో చాలా మంచి టాలెంట్ ఉందని కొంతమంది సినిమా విమర్శకులు సైతం భావిస్తున్నారు. చిరంజీవి సామాన్యంగా ఎవరిని నమ్మడు.
వాళ్ళలో టాలెంట్ ఉంటే తప్ప వాళ్ళతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడు. మరి అలాంటి చిరంజీవి శ్రీకాంత్ ఓదెల ఏరికోరి అతడితో సినిమా చేస్తున్నాడు అంటే చిరంజీవికి అతను బాగా నచ్చినట్టుగా తెలుస్తుంది. అలాగే తన మేకింగ్ స్టైల్ కూడా ఇప్పుడున్న దర్శకులలో చాలా డిఫరెంట్ గా ఉంటుందనే ఉద్దేశ్యంతోనే ఆయన శ్రీకాంత్ ఓదెలను సెలెక్ట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది…