https://oktelugu.com/

 అసలు పవన్‌ ప్లాన్‌ ఏంటి..?

గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర వైఫల్యాన్ని చవిచూసిన పవన్‌ కల్యాణ్‌.. అందుకే ఈ ‘మద్దతు’ బాటను ఎంచుకుంటున్నారా..? బీజేపీతో భాగస్వామ్యం కుదుర్చుకుని భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో నిలదిక్కుకోవాలని ప్రయత్నిస్తోంది. గత ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకొని ఆ దిశగా అడుగులు వేస్తోంది. అందుకే.. సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా బీజేపీ అడుగుజాడల్లోనే పయనిస్తోంది. Also Read: కేసీఆర్ కు మూడోఫ్రంట్ పై ఎందుకంత ఆరాటం..? జనసేన […]

Written By:
  • NARESH
  • , Updated On : November 24, 2020 / 03:51 PM IST
    Follow us on

    గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర వైఫల్యాన్ని చవిచూసిన పవన్‌ కల్యాణ్‌.. అందుకే ఈ ‘మద్దతు’ బాటను ఎంచుకుంటున్నారా..? బీజేపీతో భాగస్వామ్యం కుదుర్చుకుని భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో నిలదిక్కుకోవాలని ప్రయత్నిస్తోంది. గత ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకొని ఆ దిశగా అడుగులు వేస్తోంది. అందుకే.. సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా బీజేపీ అడుగుజాడల్లోనే పయనిస్తోంది.

    Also Read: కేసీఆర్ కు మూడోఫ్రంట్ పై ఎందుకంత ఆరాటం..?

    జనసేన కంప్లీట్‌గా సొంత పార్టీనే. కానీ సొంత నిర్ణయాలు తీసుకోకుండా బీజేపీ నేతలకే పూర్తి మద్దతు తెలుపుతున్నారు. తెలంగాణ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తానని తొలుత ప్రకటించిన పవన్ మూడు రోజుల్లోనే మాట మార్చేశారు. ఆ తర్వాత రంగంలోకి దిగిన బీజేపీ నేతలు జీహెచ్ఎంసీ బరిలో నుంచి పవన్‌ను తప్పించారు. దీంతో జనసైనికుల్లో ఆగ్రహం, నిరాశ నెలకొంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన నేతలు పవన్ ప్రకటనతో నిరాశకు గురయ్యారు. సొంత పార్టీ కార్యకర్తలే నిరసన స్వరం వినిపించారు.

    అదీ చాలదు అన్నట్లు బీజేపీ తమ అభ్యర్థుల తరఫున పవన్ కళ్యాణ్‌ను ప్రచారం చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు బీజేపీ నాయకులతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డాతోపాటు మరికొంత మంది కీలక నేతలతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేనలో ఏ పార్టీ అభ్యర్థిని పోటీకి దించాలనే అంశం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తన ప్రచారం గురించి చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    Also Read: హైదరాబాదీలకు ఉచితంగా ‘నమస్తే’ పెట్టిన టీఆర్ఎస్

    అయితే బీజేపీకి జీహెచ్ఎంసీలో మద్దతు ఇస్తున్న నేపథ్యంలో తిరుపతి లోక్ సభ సీటును తనకు కేటాయించాలని పవన్ వెల్లడించనున్నట్లు సమాచారం. దుబ్బాక ఉపఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. గత ఎన్నికల్లో తిరుపతి అభ్యర్థికి కేవలం 16 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. సామాజిక సమీకరణాలు, పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని లోక్ సభ సీటును కేటాయించాలని జనసేన డిమాండ్ చేస్తోంది. పవన్ ప్రతిపాదనను బీజేపీ పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే.. తిరుపతిపై ఆశలు పెట్టుకున్న జనసేనకు బీజేపీ నేతలు ఆ సీటును త్యాగం చేస్తారా..? లేక తాము కూడా బరిలో నిలుస్తామంటూ బెట్టు చేస్తారా..? చూడాలి మరి.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్