Chandrababu: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరనేది తెలిసిందే. ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో కూడా ఇదే నిజం అయ్యేలా వ్యాఖ్యలు ఉన్నాయి. నేడు తిట్టిన వారే గతంలో తన బలంతో రాజకీయాల్లో ఓనమాలు దిద్దుకున్నారని చెప్పడం గమనార్హం. రాజకీయాల్లో ఇలాంటి వ్యాఖ్యలు సాధారణంగానే వినిపిస్తుంటాయి. నేటి పొగడ్తలే రేపటి దీవెనలని పలువురు పేర్కొనడం విధితమే. సక్సెస్ అయిన వారి క్రెడిట్ ను కూడా తమ ఖాతాలో వేసుకుని తామే ఆ పని చేశామని చెప్పుకోవడం సాధారణమే.
Also Read: టీడీపీ వైపు జూనియర్ ఎన్టీఆర్ వస్తారా? రారా?

గతంలో చంద్రబాబు(Chandrababu) చాలా సార్లు తాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజకీయ జీవితం ఇచ్చానని చెప్పుకొన్నారు. అదే తోవలో ఏపీలో కొడాలి నాని, వల్లభనేని వంశీ తదితరులను కూడా తానే రాజకీయాల్లోకి తీసుకొచ్చి వారికి జీవితం ప్రసాదించానని పలుమార్లు తన మనసులోని మాటను బయటపెట్టారు. టీడీపీలో గెలిచినా తరువాత వారు పార్టీ మారి ఇప్పుడు ఆయనకు వ్యతిరేకులుగా మారడం విశేషం.
ఏ పార్టీలో ఉన్నా వారికి రాజకీయ భిక్ష పెట్టింది మాత్రం తానేనని చెప్పుకోవడం ఆశ్చర్యకరమే. ఎందరో యువకులను ప్రోత్సహించి తాను రాజకీయాల్లో పలు విషయాలు నేర్పించానని చెప్పుకోవడం వెనుక ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. అయితే వారు మాత్రం ఇప్పుడు బాబు అంటేనే మండిపడటం తెలిసిందే. ఇన్నాళ్లుగా అలా మాట్లాడిన బాబు ఇప్పుడు ఏం చెబుతారనే దానిపై అందరిలో ఆశ్చర్యం కలుగుతోంది.
టీడీపీలో అన్నీ తానై వ్యవహరించినా ప్రస్తుతం పరిస్థితిలో మార్పు వస్తున్నట్లు కనిపిస్తోంది. నాయకత్వంపై నేతల్లో పలు అనుమానాలు కలుగుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో బాబు నాయకత్వంలో పార్టీ నిలబడుతుందా? లేక చతికిల పడుతుందా అనే సంశయాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. సీనియర్లు సైతం ఈ ప్రశ్నలు వేస్తున్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో పార్టీని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు మరింత కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుస్తోంది.
Also Read: ఈసారి చంద్రబాబు ‘సింపతి’ వర్కౌట్ అవుతుందా..?