Actor kartikeya: రంగం ఏదైనా పైకి ఎదగాలంటే లౌక్యం చాలా అవసరం. సమయానికి తగు మాటలాడిన… అని ఓ ప్రముఖ కవి చెప్పినట్లు, సమయానుసారంగా మాట్లాడి పెద్దోళ్ల మనసులు గెలుచుకోవడం ద్వారా కెరీర్ కి కావలసిన దారులు వేసుకోవచ్చు. చిత్ర పరిశ్రమలో నిలబడాలంటే ఇది చాలా అవసరం. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ లేని హీరోలు, దర్శకులు ఈ ఫార్ములా పాటిస్తూ ఉంటారు. టాలెంట్ ఉంది కదా అని సూటిగా మాట్లాడి, పెద్దవాళ్ళకి ఎదురెళితే మటాషే.
Also Read: ఆ యాడ్ ను ప్రసారం చేయొద్దంటూ లీగల్ నోటీసు జారీ చేసిన అమితాబ్…

వర్థమాన దర్శకులు, నటులకు చిరంజీవి ఫ్యామిలీ చాలా అవకాశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళను నమ్ముకొని పరిశ్రమకు వచ్చిన వాళ్ళ లైఫ్స్ సెటిల్ చేసిన ఘనత వారిది. భోళాశంకరుడుగా పేరున్న చిరంజీవి చిన్న చిన్న పొగడ్తలకు కూడా పడిపోతారు. ఆయన మనసు తెలుసుకున్న యంగ్ హీరో కార్తికేయ మెగా ఫ్యామిలీలో పాగా వేశాడు. ఒకే ఒక సందర్భం కార్తికేయను చిరంజీవికి దగ్గర చేసింది.
దాదాపు ఏడాది క్రితం జీ సినిమా అవార్డ్స్ వేడుకకు చిరంజీవి అతిథిగా హాజరయ్యారు. ఈ వేదికపై చిరంజీవి సాంగ్స్ కి అదిరిపోయే స్టెప్స్ వేసిన కార్తికేయ, తన ఎమోషనల్ స్పీచ్ తో చిరంజీవి మనసు దోచేశాడు. హీరోలు కావాలన్న ఎందరో యువ నటులకు చిరంజీవి గారు స్ఫూర్తి, ఒక్క చరణ్ మాత్రమే కాదు, మాలాంటి యువ హీరోలందరూ ఆయన కొడుకులమే, మా అందరికీ చిరంజీవిగారు తండ్రితో సమానం అంటూ.. ఎమోషనల్ అయ్యాడు. కార్తికేయ స్పీచ్ కి చిరంజీవి కన్నీరు పెట్టుకోవడం జరిగింది. స్టేజ్ పై నుండి క్రిందికి వచ్చి, చిరంజీవి కాళ్లపై పడ్డాడు కార్తికేయ.
ఆ సందర్భం మెగా ఫ్యామిలీ తరుపు నుంచి కార్తికేయకు పూర్తి మద్దతు దక్కేలా చేసింది. ఆయన చేసిన ‘చావు కబురు చల్లగా’ చిత్రం గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో తెరకెక్కిన విషయం తెలిసిందే. కాగా నేడు కార్తికేయ వివాహం కాగా, చిరంజీవి స్వయంగా హాజరయ్యారు. మరి ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని కార్తికేయ వివాహానికి చిరంజీవి హాజరుకావడం, పెద్ద విశేషం అని చెప్పాలి. చిరంజీవి కార్తికేయను ఎంతగా ఇష్టపడుతున్నారో చెప్పడానికి ఇదే నిదర్శనం.
Also Read: పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదేనేమో.. అల్లు అర్హ అరుదైన రికార్డు