https://oktelugu.com/

Medaram Earthquake : ఇప్పుడు  మేడారంలో.. ఒకప్పుడు లాతూర్ లో.. నాటి విలయానికి.. నేటి భూ ప్రకంపనలకు సంబంధం ఏంటి?

లాతూర్.. సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం దుర్భరమైన నీటి కరువును ఎదుర్కొన్న ప్రాంతం ఇది. అక్కడ తాగునీటి సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఏకంగా రైలు వ్యాగన్లలో నీరు పంపించింది. అప్పుడు లాతూర్ ప్రాంతం గురించి అంతర్జాతీయ మీడియాలోనూ వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాంతం గురించి ప్రస్తావన ఎందుకంటే.. ఈ కథనం చదివితే మీకే తెలుస్తుంది..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 4, 2024 / 07:54 PM IST

    Medaram Earthquake

    Follow us on

    Medaram Earthquake : లాతూర్ అనేది మహారాష్ట్రలోని ఓ ప్రాంతం. ఇక్కడ పత్తి విస్తారంగా పండుతుంది. రైతులు బార్లీ, కందులు, బంగాళదుంపలను సాగు చేస్తారు. జనుములు కూడా భారీగానే పండుతాయి. అయితే ఈ ప్రాంతంలో సరిగా 1993 సంవత్సరం సెప్టెంబర్ 30 తెల్లవారుజామున మూడు గంటల 56 నిమిషాలకు భీకరమైన భూకంపం వచ్చింది. నాటి విలయం వల్ల పదివేల మంది చనిపోయారు. ప్రజలు గాఢ నిద్రలో ఉన్నప్పుడు భూకంపం రావడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది.. అప్పుడు లాతూరు మాత్రమే కాకుండా.. చుట్టుపక్కల ఉన్న 12 జిల్లాల్లో ఆ భూకంపం ప్రభావాన్ని చూపించింది. దాని ఎఫెక్ట్ వల్ల రెండు లక్షల పదకొండు వేల గృహాలు నేలమట్టమయ్యాయి. 52 గ్రామాలు సర్వనాశనం అయ్యాయి. లాతూర్ పట్టణంలో జన సాంద్రత అధికంగా ఉండడంతో ప్రాణ నష్టం తీవ్రంగా జరిగింది. అప్పుడు భూకంపం రిక్టర్ స్కేల్ పై 6.4 గా రికార్డ్ అయింది. అయితే ఈ స్థాయిలో భూకంపాలు రావడానికి ప్రకృతి ముందుగానే సంకేతాలు పంపిస్తుందట. ఈ భూకంపం రావడానికి అంటే ముందు లాతూర్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 125 తేలికపాటి ప్రకంపనలు చోటు చేసుకున్నాయట. అయితే ఇవన్నీ కూడా 1992 ఆగస్టు – 1993 మార్చి మధ్య జరిగాయట.

    నాటి భూకంపంలో..

    నాటి భూకంపం వల్ల లాతూరు జిల్లాలోని ఔసా తాలూకా, ఉస్మానాబాద్ లోని ఉమార్గా తాలూకా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ ఘటన లాతూర్ ప్రాంతాన్ని మాత్రమే కాకుండా మహారాష్ట్రను ఏకంగా సంక్షోభంలో కూరుకు పోయేలా చేసింది. నాడు దేశ విదేశాలు మహారాష్ట్రకు సహాయం అందించాయి. ఈ భూకంపం చోటు చేసుకొని మూడు దశాబ్దాలు దాటినప్పటికీ లాతూర్ ప్రాంత వాసులు నాటి ఘటన గురించి చెప్తే ఇప్పటికి కానేటి పర్యంతమవుతారు.

    మేడారంలో అందుకే..

    ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని మేడారం కేంద్రంగా స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. దీని ప్రభావం వల్ల ఉమ్మడి వరంగల్, నల్లగొండ, కరీంనగర్, హైదరాబాద్, ఏపీలోని ఉమ్మడి కృష్ణాజిల్లాల్లో పలు ప్రాంతాలలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూమి కంపించడం వల్ల జనాలు ప్రాణ భయంతో బయటికి పరుగులు తీశారు. నాటి లాతూర్ భూకంపాన్ని పరిగణలోకి తీసుకుంటే.. మేడారంలో భూకంపానికి ముందు అలాంటి హెచ్చరికల్లో ఒకటి ఇటీవల చోటుచేసుకుంది. సరిగ్గా మూడు నెలల క్రితం సెప్టెంబర్ 3న ఈ ప్రాంతంలో భారీ గాలి వీచింది. దాని ప్రభావం వల్ల వేలాది చెట్లు నేలకులాయి. సహజంగా ఇలాంటి గాలులు అమెరికా లాంటి దేశాలలో వీస్తాయి. కానీ మేడారం అడవుల్లో అలాంటి గాలివీయడం ఇప్పటికీ శాస్త్ర వేత్తలకు అంతు చిక్కడం లేదు. అయితే మూడు నెలల వ్యవధిలోనే ఇక్కడ స్వల్ప స్థాయిలో భూకంపం చోటు చేసుకోవడం విశేషం. అయితే ఇది ప్రకృతి పంపిన హెచ్చరికగానే స్థానికులు చెబుతున్నారు.